పొట్టి క్రికెట్ ప్రపంచకప్ కు కౌంట్ డౌన్ మొదలైందనే చెప్పాలి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్-2022కి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ నెలలో ఈ పొట్టి క్రికెట్ సమరం జరుగుతుంది. ఇప్పటికే అన్ని జట్లు టైటిల్ కోసం తమ వ్యూహాలను రచించడం, జట్టును సమాయత్తం చేసుకోవడం చేస్తున్నాయి. ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా కూడా టీ20 వరల్డ్ కప్ కోసం గట్టిగానే ఏర్పాట్లు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారాలు కూడా ప్రారంభించేశాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్ అధికారిక సోషల్ మీడియా పేజెస్ లో ప్రోమో ఒకదాన్ని విడుదల చేశారు. ఆ ప్రోమోలో టీమిండియా సెన్సేషన్, వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ కు అరుదైన గౌరవం కట్టబెట్టారు. ప్రోమో స్టార్టింగ్ లో రిషబ్ పంత్ నీటిలో నుంచి గాడ్జిల్లాలా పెద్ద ఆకారంలో ఎంట్రీ ఇస్తాడు. బిగ్ టైమ్ రిషబ్ పంత్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. A visit for the trophy to the set of Harry Potter and the Cursed Child in Melbourne ♂️ No spells cast this time, we're saving the magic for on the field later this year. #T20WorldCup pic.twitter.com/xk3loikSj9 — T20 World Cup (@T20WorldCup) July 11, 2022 ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలకి క్రికెట్ లో ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్న, టాప్ ప్లేయర్లకు ఇలాంటి అరుదైన గౌరవాన్ని ఇస్తారు. అలాంటి గౌరవం రిషబ్ పంత్ కు దక్కడంపై టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లకు దక్కనిది పంత్ కు దక్కడంపై ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Welcome to The Big Time, Rishabh Pant #T20WorldCup pic.twitter.com/ZUSK63ssFZ — T20 World Cup (@T20WorldCup) July 10, 2022 ఇదీ చదవండి: భువనేశ్వర్ కుమార్ సూపర్ రికార్డ్.. టీమిండియాలోనే తొలి బౌలర్ గా! ఇదీ చదవండి: సూర్యకుమార్ యాదవ్ ఆడినలాంటి షాట్స్ ఇప్పటివరకు చూడలేదు: ఇంగ్లాండ్ బౌలర్