ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియంలో శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఐదు టీ20ల సిరీస్‌ను కూడా గ్రాండ్ విక్టరీతో ప్రారంభించింది. కాగా మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టాస్ సమయంలో రెండు జట్ల కెప్టెన్లు మాట్లాడుకోవడమనేది సహజం కానీ.. పూరన్‌తో మాట్లాడుతూ రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్స్ మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. దీంతో రోహిత్-పూరన్ అసలు ఏ విషయం గురించి మాట్లాడుకున్నారు? అనే విషయంపై అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. కాగా.. ఆ ఫోటోలు చూసిన అభిమానులు సరదాగా కొన్ని మీమ్స్ చేస్తున్నారు. ఆ సంభాషణలో పూరన్ ‘టీ20 సిరీస్‌ను మేమే గెలవబోతున్నాం అని చెప్పగా.. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉన్న యంగ్ టీమ్‌నే ఓడించేలేకపోయారు. ఇక నేను కెప్టెన్‌గా ఉన్న టీమ్‌పై గెలుస్తారా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థం అవుతుందా?’ అంటూ రోహిత్‌శర్మ పూరన్‌తో అంటున్నట్లు మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సిరీస్‌కు ముందు విండీస్ కెప్టెన్ పూరన్ వన్డే సిరీస్ ఓటమిని టీ20 సిరీస్‌తో సమం చేస్తామని చేసిన కామెంట్స్ ఫలితమే ఈ మీమ్స్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాను టీ20 సిరీస్‌లో ఓడిస్తామని పూరన్ పలికిన ఢాంబికాలకు సెటైర్లుగా నెటిజన్లు ఆ ఫోటోపై కామెంట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ వర్మ 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 24, దినేష్ కార్తీక్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో రాణించారు. లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ను టీమిండియా బౌలర్లు కేవలం 122 పరుగులకే కట్టడి చేశాడు. అర్షదీప్ సింగ్, అశ్విన్, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసిన విండీస్ 68 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సంచలన ఇన్నింగ్స్ ఆడిన దినేష్ కార్తీక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరి మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ, నికోలస్ పూరన్ ఏ విషయంపై మాట్లాడుకుని ఉంటారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. What's Rohit telling Pooran?#WIvIND pic.twitter.com/hy8Fc0Y4mU — ESPNcricinfo (@ESPNcricinfo) July 29, 2022