గత దశాబ్దంలో 20 వేలకు పైగా పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది డికేట్'గా నిలిచిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు వరుస వైఫల్యాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. టన్నుల్లో పరుగులు చేసినప్పుడు మెచ్చుకోవడానికి పెగలని నోళ్లు, ఇప్పుడు విరాట్ కోహ్లీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీరంగం సృష్టిస్తున్నాయి. వీటన్నటికి విరాట్ తన బ్యాటుతో ఎప్పుడు సమాధానం చెబుతాడా? అని కోహ్లీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా కోహ్లీ తన భవిష్యత్ లక్ష్యాలేంటో చెప్పుకొచ్చాడు. ఎన్ని మ్యాచులాడినా.. ఎన్ని విజయాలు సాధించినా కోహ్లీ కెరీర్ లో ఐసీసీ టోర్నీ లోటు వెంటాడుతూనే ఉంది. తాజాగా కోహ్లీ దానిని కూడా సాధిస్తానని అంటున్నాడు. అందుకోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని పేర్కొన్నాడు. ఆగస్టులో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ స్పందిస్తూ.. 'నా ప్రధాన లక్ష్యం భారత్ కు ఆసియా కప్ తో పాటు ప్రపంచకప్ ను అందించడమే. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం..' అని పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్.. ఈ వ్యాఖ్యలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. The giving us another reason to #BelieveInBlue! Get your game face on & cheer for @imVkohli & #TeamIndia in their quest to win the #AsiaCup 2022 ! Starts Aug 27 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/Ie3119rKyw — Star Sports (@StarSportsIndia) July 23, 2022 ఫామ్‌లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ. వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్ నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు భారత జట్టుకి దూరంగా గడపబోతున్న టీమిండియా మాజీ సారథి, పసికూన జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. The battle for Asian supremacy is . Get set to #BelieveInBlue as @ImRo45 leads #TeamIndia at the #AsiaCup2022! Starts Aug 27 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/K2hcfuGeBK — Star Sports (@StarSportsIndia) July 22, 2022 #AsiaCup2022 - Heads - Asia Cup 2022 will be played in UAE - Sri Lankan Cricket Board & GOVT withdrawn themselves to host the event due to the curfew in country - Here is the expected schedule of Asia Cup - India & Pakistan will meet twice (thrice if both qualifies for final) pic.twitter.com/byKjVl1DAV — Ahmad Haseeb (@iamAhmadhaseeb) July 22, 2022 ఇది కూడా చదవండి: IND vs WI: మ్యాచ్ చివర్లో అంతా బయటికొచ్చేశారు! కోపంగా అరిచిన ద్రవిడ్ ఇది కూడా చదవండి: Mohammed Shami: ఖరీదైన కారు కొన్న మహ్మద్ షమీ.. ధర ఎంతంటే?