గాయం కారణంగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ తరువాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ జడేజా ఆడలేదు. అలా మాయమైన జడ్డూ.. ఇప్పుడు ఆస్పత్రి బెడ్ పై నడవలేని స్థితిలో కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పాకిస్తాన్ పై తొలి పోరులో 35 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించిన జడేజా.. ఆ తరువాత మోకాలి గాయం కారణంగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఈ క్రమంలో జడేజా తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ మేరకు శస్త్రచికిత్స విజయవంతమైందని తెలుపుతూ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యాప్షన్‌తో పాటు ఫోటోను పోస్ట్ చేసాడు. "శస్త్రచికిత్స విజయవంతమైంది, తిరిగి జట్టుతో చేరడానికి నా వంతుగా కృషి చేస్తాను. ఇందుకు నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, అభిమానులకు కృతజ్ఞతలు" అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja) జడేజా లోటును టీమిండియా ఇతర ఆటగాళ్లతో భర్తీ చేయలేకపోతోంది. జడ్డూ.. తుది జట్టులో ఉంటే బ్యాటింగ్ లో రాణించడంతో పాటు.. బౌలింగ్ లోనూ తన 4 ఓవర్ల కోటాను సమర్థవంతంగా పూర్తి చేయగలడు. ప్రస్తుతానికి, ఆ స్థానాన్నిఅక్సర్ పటేల్ తో భర్తీ చేసినా, అతనికి తుది జట్టులో స్నానం కల్పించలేదు. సూపర్ - 4 స్టేజ్ లో పాకిస్తాన్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసిన భారత జట్టు ఇవాళ శ్రీలంక చావో రేవో తేల్చుకుంటోంది. టీ20 ప్రపంచ కప్ నాటికి జడేజా తిరిగి కోలుకోవాలని మనమూ ఆశిద్దాం. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Sri Lanka have won the toss and elect to bowl first. Live - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/M5ELveGnls — BCCI (@BCCI) September 6, 2022 ఇదీ చదవండి: Urvashi Rautela: పాక్ క్రికెటర్ తో ఊర్వశి! వీడియో వైరల్.. ఇదీ చదవండి: వీడియో: రెప్పపాటులో క్యాచ్ అందుకున్న మాక్స్‌వెల్.. చూశాక వావ్ అనాల్సిందే!