ఆసియా కప్ 2022.. టైటిల్ ఫేవరెట్ జట్టుగా భరిలోకి దిగిన భారత్ కు నిరాశ ఎదురైంది. ఆసియా కప్ లో భాగంగా సూపర్-4లో వరుస మ్యాచ్ ల్లో పాకిస్థాన్, శ్రీలంకపై పరాజయాలతో టీమిండియా ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటు జట్టుపై.. అటు కోచ్ ద్రవిడ్ పై.. సెలక్షన్ కమిటీపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. టీమిండియా ఈ ఓటముల నుంచైనా గుణపాఠాలు నేర్వాలి అని కొందరు అంటే.. మరి కొందరేమో జట్టును ప్రక్షాళన గావించాలి అని అంటున్నారు. ఆస్ట్రేలియా వేదికగా త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కు ముందు ఈ ఆసియా కప్ లో వరుస ఓటములు ఓ మేల్కోలుపు అని వారు అభిప్రాయ పడుతున్నారు. ఈ తరుణంలోనే కోచ్ ద్రవిడ్ పై మాజీ సెలక్టర్ సబా కరీమ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. రాహుల్ ద్రవిడ్.. టీమిండియాకు తన క్లాస్ బ్యాటింగ్ తో ఎన్నో విజయాలను అందించిన ఘనుడు. ఇక తన రిటైర్మెంట్ తర్వాత కూడా జట్టుకు ఏదో ఒక పదవి రూపంలో సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే రవిశాస్త్రీ తరువాత హెడ్ కోచ్ పదవిని ద్రవిడ్ అలంకరించాడు. ఇక అప్పటి నుంచి జట్టులో రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. ప్రయోగాల్లో భాగంగా కొన్ని ఎదురుదెబ్బలు సైతం తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆసియా కప్ ఓటమి తర్వాత అతడిపై విమర్శలు ఎక్కువైయ్యాయి. బీసీసీఐ మాజీ సెలెక్టర్ సబా కరీమ్ ద్రవిడ్ పై ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ద్రవిడ్ కోచ్ బాధ్యతలపై మాట్లడుతూ.. '' ప్రస్తుతం కోచ్ గా అతడి హనీమూన్ కాలం ముగిసింది. ఇక రాబోయే కాలంలో అయినా అతడు జట్టుపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది" అని అన్నారు. ద్రవిడ్ కోచ్ గా పగ్గాలు చేపట్టాకా భారత జట్టు చాలా మెరుగైంది.. అయినప్పటికీ కొన్ని కొన్ని లోపాలు లేకపోలేదు. అద్బుతమైన ప్రదర్శన కోసం ద్రవిడ్ శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఫలితాల్లో మాత్రం అలా కనిపించడం లేదు. దీంతో ద్రవిడ్ పై ఒత్తిడి పెరిగిపోయింది. అదీ కాక అతడు ప్రయోగాలు చేస్తూ టీమ్ ను బలపరుస్తున్నాడో.. బలహీన పరుస్తున్నాడో తెలియడం లేదని " కరీం అన్నారు. అదీ కాక తాజాగా ఆసియా కప్ ఓటమి.. ప్రస్తుతం అతడికి చాలా కఠిన సమయం నడుస్తోంది. ఇక రాబోయే కాలంలో ద్రవిడ్ కు అసలైన సవాళ్లు ఉన్నాయి.. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్, వచ్చే సంవత్సరం ప్రపంచ కప్ లు టీమిండియా గెలుచుకోగలిగితే.. ద్రవిడ్ కోచ్ గా సంతృప్తి చెందుతాడు" అని అంటూనే.. భారత్ అన్ని ఐసీసీ ఈవెంట్లలో అగ్రస్థాన్నాన్ని అలంకరించినప్పుడే రాహుల్ పదవీ కాలం విజయవంతం అవుతుందని అతడు అర్దం చేసుకోగలడని, అప్పటి వరకు ద్రవిడ్ కు సంతృప్తి ఉండదని" కరీం పేర్కొన్నాడు. మరి ఇండియన్ క్రికెట్ వాల్ పై బీసీసీఐ సెలక్టర్ కరీమ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: వీడియో: సోషల్ మీడియను ఊపేస్తున్న కోహ్లీ ర్యాప్ సాంగ్! ఫ్యాన్స్‌కు పండుగే.. ఇదీ చదవండి: Team India: ఫామ్‌లోకి టీమిండియా మెయిన్ పిల్లర్లు! ఇక తిరుగుండదు..