IND Vs SA: రాహుల్ ద్రావిడ్ అలియాస్ ది వాల్.. టీమిండియా క్రికెట్ హిస్టరో వికెట్లకు ముందు కట్టని గోడగా నిలబడి ఎన్ని విజయాలు తెచ్చిపెట్టాడో.. ఎన్ని రికార్డులు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ అనుభవం, టాలెంట్ ఊరికే పోకూడదని సౌరవ్ గంగూలీ పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మరీ.. ద్రావిడ్ ని టీమిండియాకి మూడు ఫార్మట్లలో హెడ్ కోచ్ గా కొనసాగాలని కోరాడు. ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఏదో ఊద్యోగంలా చూడలేదు. ఎన్నో ప్రణాళికలు మరెన్నో వ్యూహాలతో ఈ పదివి చేపట్టాడు. హెడ్ కోచ్ గా నియమితుడైంది మొదలు తన ప్లాన్లు అమలు చేయడం మొదలుపెట్టాడు. రాహుల్ ద్రావిడ్ ప్రణాళికల్లో ప్రధానమైంది, మొదటిది కుర్రాళ్లకు అవకాశాలు కల్పించడం. టీమ్ లో సీనియర్లు ఉండగానే కుర్రాళ్లను ట్రైన్ చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వీలున్నప్పుడల్లా సీనియర్లని సైతం పక్కనబెట్టి కుర్రాళ్లకు అవకాశాలు కల్పిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే మనం రాహుల్ ద్రావిడ్ చేయాలనుకున్నది చేతల్లో చూశాం కూడా. అందుకు ఉదాహరణ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ లను జట్టులోకి తీసుకోవడమే. ఇదీ చదవండి: స్విమ్ సూట్ ధరించి అనుష్క శర్మ సెల్ఫీలు.. కోహ్లీ ఫాన్స్ ఫైర్! ఇదీ చదవండి: రికార్డులు బద్దలు కొడుతున్న ఐపీఎల్ మీడియా రైట్స్.. ఒక్కో మ్యాచ్ కు రూ. 100 కోట్ల పైనే.. ఇలా చేయడం కొత్తే కాదు.. కాస్తో కూస్తో టాలెంట్ ఉన్న కుర్రాళ్లను టీమిండియా క్యాంపులో ట్రైన్ చేస్తున్నారు. అయితే అందివచ్చిన అవకాశాలను కుర్రాళ్లు సద్వినియోగం చేసుకుంటున్న దాఖలాలు లేవు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి రెండు మ్యాచ్ లు చూస్తే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో సమిష్టిగా రాణించింది లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ ద్రావిడ్ అనుకున్నది ఒకటైతే.. కుర్రాళ్లు చేస్తోంది ఒకటని స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నో ఆశలు, ఆశయాలతో టీమిండియా హెడ్ కోచ్ పదవి తీసుకున్న రాహుల్ ద్రావిడ్ కు ప్రతి సిరీస్ లో నిరాశ తప్పడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కోచ్ కు ఉన్న పట్టుదల ప్లేయర్లలో కనిపించడం లేదనే భావన కూడా చాలా మందిలో ఉంది. ద్రావిడ్ అవకాశాలు కల్పిస్తుంటే.. వీళ్లేమో రాహుల్ ద్రావిడ్ పరువు తీస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. కుర్రాళ్లు రాహుల్ ద్రావిడ్ పరువు తీస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: కొట్టుకు చచ్చిన ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్! ఇదీ చదవండి: IPL ఆదాయం లెక్కలపై సౌరవ్ గంగూలీ ఓపెన్ కామెంట్స్!