ప్రపంచ బాక్సింగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ కామన్వెల్త్‌లోనూ సత్తా చాటింది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో 48-50 కేజీల్ లైట్ ఫ్లై విభాగంలో భారత్‌కు స్వర్ణపతకం అందించింది. ఫైనల్లో జరీన్.. నార్త్రన్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్‌నౌల్‌ను 5-0 తేడాతో మట్టికరిపించి, భారత్‌కు మూడో బాక్సింగ్ స్వర్ణాన్ని అందించింది. జరీన్ పసిడి పంచ్‌తో బాక్సింగ్‌లో భారత్ పతకాల సంఖ్య 5కు (3 స్వర్ణాలు, 2 కాంస్యాలు) చేరగా, మొత్తగా 48(17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు) పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. కాగా ఆదివారం ఒక్కరోజే భారత బాక్సర్లు మూడు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్ స్వర్ణంతో బోణీ కొట్టగా, ఆతర్వాత నిమిషాల వ్యవధిలోనే పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసిరాడు. మహిళల 48-50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ మరో స్వర్ణం సాధించింది. ఇక పురుషుల ఫెదర్‌వెయిట్ 57 కేజీల విభాగంలో మహ్మద్ హుస్సాముద్దీన్, పురుషుల 67 కేజీల వెల్టర్‌వెయిట్ విభాగంలో రోహిత్ టోకాస్‌లు ఇదివరకే కాంస్య పతకాలు గెలిచారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నిఖత్.. భారత్‌కు గర్వకారణమని, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని.. నిఖత్ గెలుపుతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమైంది, నిఖత్.. తన విజయపరంపరను కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మరి నిఖత్ జరీన్ సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Another Gold Nikhat Zareen Jai Hind pic.twitter.com/UjzhcnO3Qg — KJS DHILLON (@Tiny_Dhillon) August 7, 2022 First, World Champion and now CWG Gold Medalist.#NikhatZareen #Nikhat #Boxing #Sky11 #CWG2022 pic.twitter.com/jb5MNBEVN7 — Sky11 (@sky11official) August 7, 2022 her way to glory! @nikhat_zareen does it in style with a medal in the Women’s Boxing Light Flyweight category @birminghamcg22 #EkIndiaTeamIndia #B2022 pic.twitter.com/el8ZWwHhNK — Team India (@WeAreTeamIndia) August 7, 2022 ఇది కూడా చదవండి: గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన భవినా పటేల్!