Rohit Sharma-Ritika Sajdeh In Dubai: ఆసియా కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు సూపర్- 4 దశలోనే ఇంటిదారి పట్టింది. ఫైనల్ కు అర్హత సాధించాలంటే.. తప్పక గెలవాల్సిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలయ్యింది. తొలుత పాకిస్తాన్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవి చూసిన భారత జట్టు, ఆపై.. శ్రీలంకతో 6 వికెట్ల తేడాతో ఓటిమి పాలయ్యింది. ఈ క్రమంలో, త్వరగా ఈ ఓటమిని మరిచిపోయి.. రాబోవు సిరీసులపై శ్రద్ధ పెడతారానుకుంటే.. 'నో.. నో.. అంటూ' దుబాయిలో కుటుంబ సభ్యులతో కలిసి చక్కర్లు కొడుతున్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజనులు.. ఇందుకోసమేనా దుబాయ్ వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి.. ఇక నెల రోజులే సమయముంది. ఈ పాటికే మెగాటోర్నీకి జట్టు ఎంపికపై ఓ అంచనాకు రావాల్సి ఉండగా.. స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీసులు కారణంగా అది వాయిదా పడుతోంది. ఆసియా కప్ 2022 గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతారునుకుంటే.. సూపర్- 4 దశలోనే ఇంటిదారి పట్టి కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆరు జట్లు మాత్రమే పాల్గొన్న ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరలేకపోయిన భారత్.. ఐసీసీ టోర్నీలో ఏం చేస్తుందో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పోనీ, పొట్టి ప్రపంచకప్ కైనా గట్టిగా ప్రాక్టీస్ చేస్తారనుకుంటే.. అవన్నీ వదిలేసి దుబాయ్ లోనే మకాం పెట్టేశారు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) పోనీ, ఇదేదో ఆటగాళ్లు చేశారా! అంటే.. కాదు, టీమిండియా సారధే అలాంటి పని చేశాడు. "ఇదిగోండి.. మేమిద్దరం.. దుబాయిలో కలిసి తిరుగుతున్నామంటూ.." రోహిత్ శర్మ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలను చూశాక నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చి.." ఇందుకేగా.. మనం దుబాయి వచ్చింది.. నెల రోజుల ఇక్కడే ఉండి.. ఇటునుంచే ఆస్ట్రేలియా పోదామంటూ.." కామెంట్లు చేస్తున్నారు. నలుగురికి దారి చూపాల్సిన సారధి, ఇలా చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఆసియా కప్‌లో టీమిండియా వైఫల్యానికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ ఇదీ చదవండి: వీడియో: ఈ ఫీల్డింగ్ చూశాక.. ఆస్ట్రేలియా జట్టును నెంబర్-1 టీం అని ఎవరైనా అంటారా!