ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ తన రెక్కలను మరింత విస్తరించింది. త్వరలో ప్రారంభం కానున్న యూఏఈ టీ20 క్రికెట్ లీగ్‌లో, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ గ్రూప్ ఫ్రాంచైజ్‌లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. యూఏఈ లీగ్‌లో ఆరు జట్లలో ఒక టీమ్‌ను రిలయన్స్ గ్రూప్ సొంతం చేసుకుంది. అలాగే సౌతాఫ్రికాలోని ఆరు ఫ్రాంచైజ్‌లలో రిలయన్స్ కేప్‌టౌన్ ఫ్రాంచైజ్‌ను దక్కించుకుంది. తాజా ఆయా జట్లకు పేర్లను ప్రకటించింది ముంబై ఇండియన్స్. యూఏఈలో ఎంఐ ఎమిరేట్స్‌గా, సౌతాఫ్రికాలో ఎంఐ కేప్‌టౌన్‌గా తమ జట్లకు నామకరణం చేసింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా ఐదు సార్లు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో అత్యధిక టైటిళ్లు ముంబై వద్దే ఉన్నాయి. కానీ.. ఐపీఎల్ 2022 సీజన్‌లో మాత్రం ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనను కనబర్చింది. కానీ ఆ ప్రభావం రానున్న సీజన్‌లో పడకుండా ముంబై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదిలించుకునేందుకు కూడా ముంబై యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అలాగే సౌతాఫ్రికా, యూఏఈ లీగ్‌లలో కూడా మంచి జట్లను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఐపీఎల్‌లో ఉన్న తమకున్న బ్రాండ్ ఇమేజ్, సక్సెస్ ట్రాక్‌ను అక్కడ కూడా కొనసాగించాలని ఎంఐ మేనేజ్‌మెంట్ దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్, ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ పేర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Welcoming @MIEmirates & @MICapeTown into our FALY OF TEAMS! Read more - https://t.co/85uWk804hU#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA — Mumbai Indians (@mipaltan) August 10, 2022 Presenting @MICapeTown & @MIEmirates #OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H — Mumbai Indians (@mipaltan) August 10, 2022 ఇది కూడా చదవండి: వాళ్లు ఆడితే.. IPLకు వచ్చే నష్టమేమి లేదు: గిల్‌క్రిస్ట్