టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చాడు. కెప్టెన్ గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన మహీ..మళ్లీ జట్టుతో కలిసి సందండి చేశాడు. తనతో కలిసి ఆడిన ఆటగాళ్లుతో ముచ్చటించాడు. యువ ఆటగాళ్లకు విలువైన సూచనలు ఇస్తూ క్లాస్‌లు పీకాడు. గతేడాది జరిగిన T-20 ప్రపంచకప్‌లో బీసీసీఐ రిక్వెస్ట్ మేరకు టీమ్ మెంటార్‌గా పనిచేసిన ధోనీ.. మళ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రావడం చర్చనీయాంశమైంది. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కూడా ధోనీ సేవలను వాడుకుంటారా? అనే వాదన తెరపైకి వచ్చింది. అయితే మహీ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చింది అతిథిగా మాత్రమేనని బీసీసీఐ తెలిపింది. తన పెళ్లి రోజు, పుట్టిన రోజు వేడుకల కోసం ధోనీ వారం క్రితమే కుటుంబంతో కలిసి లండన్ వేకేషన్‌కు వెళ్లాడు. అక్కడే అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి రోజు(జూలై 4), పుట్టిన రోజు(జూలై 7)వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. బర్త్ డే వేడుకులకు టీమిండియా నుంచి రిషభ్ పంత్ తో పాటు మరికొందరు టీమిండియా ఆటగాళ్లు హాజరయ్యారు. శనివారం రాత్రి బర్మింగ్ హోమ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ-20 మ్యాచ్ చూసేందుకు ధోని స్టేడియానికి వెళ్లాడు. మ్యాచ్ ముగిసిన అనంతంరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి.. మహీ సందడి చేశాడు. ఈక్రమంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ , స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ఇతర టీమిండియా సిబ్బందితో ముచ్చటించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. గొప్ప వ్యక్తి ధోని ఎప్పుడు మాట్లాడుతున్నా అందరు వింటుంటారు... అనే క్యాప్షన్ ఇచ్చారు. అలాగే, స్టేడియంలో రిషబ్ పంత్, రోహిత్ లతో కూడా ధోనీ ఫొటో దిగాడు. ఇవన్నీ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మరి.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో మహీ సందడి చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Always all ears when the great @msdhoni talks! #TeamIndia | #ENGvIND pic.twitter.com/YKQS8taVcH — BCCI (@BCCI) July 9, 2022 ఇదీ చదవండి: Rohit Sharma, Virat Kohli: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ, కోహ్లీ! ఎవరు ముందు సాధిస్తారో? ఇదీ చదవండి: Vitality Blast: బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో ఐదు సిక్సులు,ఒక ఫోర్ తో విధ్వంసం!