క్రికెటర్స్‌కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే స్పెషల్ ఏవీలు వేయాల్సిన అవసరం లేదు. క్రికెటర్స్ మొదటి మ్యాచ్‌తో గ్రౌండ్‌లో తమ సత్తా చాటడంతోనే ఇన్‌బిల్ట్ మన హృదయంలో అభిమానం ఏర్పడిపోతుంది. వీళ్ళు పాన్ వరల్డ్ స్టార్స్. అలాంటి స్టార్‌లు బయటకనబడితే జనాలు ఎగబడకుండా ఉంటారా? మిషన్ ఇంపాజిబుల్!. తాజాగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మంగళవారం ముంబైలోని హోటల్‌కు వెళ్ళిన రోహిత్‌కు అభిమానులు ఊహించని షాకిచ్చారు. రోహిత్ శర్మ ఆ హోటల్‌కు వచ్చారని తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయడంతో స్థానికంగా ఉన్న అభిమానులంతా రోహిత్ శర్మను చూసేందుకు హోటల్‌కు వెళ్ళారు. అంతమంది ఫ్యాన్స్‌ని అలా చూసేసరికి రోహిత్ ఆశ్చర్యపోయారు. హోటల్ నుండి బయటకు వెళ్ళేందుకు ప్రయత్నించగా.. భారీ సంఖ్యలో అభిమానులు హోటల్ ముందు పోటెత్తారు. దీంతో రోహిత్ హోటల్ రూమ్‌కి వెళ్ళిపోయారు. పోలీసుల సహాయంతో హోటల్ సిబ్బంది అభిమానులని అక్కడి నుండి పంపించిన తర్వాత రోహిత్‌ను ఇంటికి పంపించారు. ఇంతలా అభిమానులు తన గురించి రావడం పట్ల రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రోహిత్ శర్మ దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్ 2022 టోర్నమెంట్ కోసం సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన హోమ్ టౌన్ అయిన ముంబైలో ఫ్యామిలీతో రిలాక్స్ అవుతున్నారు. పని మీద హోటల్‌కు వెళ్ళిన రోహిత్‌ను ఈ విధంగా అభిమానులు పలకరించారు. పిలవకుండానే ఇంతమంది అభిమానులు తరలివచ్చారంటే.. ఇక పిలిస్తే ఎంతమంది వస్తారో? మరి రోహిత్ శర్మ కోసం భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. Massive crowd gathers outside the hotel to see Rohit Sharma. pic.twitter.com/hUhrS2bT8j — Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2022