కరేబియన్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఏకంగా 600 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఆడుతున్న ఈ హిట్టర్ లండన్ స్పిరిట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పొలార్డ్ 600 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. కాగా తన 600వ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో పొలార్డ్ 11 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అందులో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. పొలార్డ్ టీ20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్ అన్న విషయం తెలిసిందే. 600 మ్యాచ్‌ల్లో 31.34 సగటుతో 11,723 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ.. 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టే పొలార్డ్ 309 వికెట్లు కూడా పడగొట్టాడు. దాదాపు 15 ఏళ్ల నుంచి టీ20 క్రికెట్ ఆడుతున్న పొలార్డ్ వెస్టిండీస్‌తో లీగ్ క్రికెట్‌లో ఎన్నో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌లో పొలార్డ్ కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. పొలార్డ్ తర్వాత అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన జాబితాలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో(543 మ్యాచ్‌లు), పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్(472 మ్యాచ్‌లు), యునివర్సల్ బాస్ క్రిస్ గేల్(463 మ్యాచ్‌లు), ఇంగ్లండ్ ఆటగాడు రవి బొపారా(426 మ్యాచ్‌లు) ఉన్నారు. మరి పొల్డార్ సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Another milestone for the legend ✨ Kieron Pollard is the first cricketer to play in 600 T20 matches pic.twitter.com/3NKzaoGPLZ — ESPNcricinfo (@ESPNcricinfo) August 8, 2022 ఇది కూడా చదవండి: జడేజా భార్య గొప్ప మనసును ప్రశంసించిన ప్రధాని మోదీ!