యూఏఈ వేదికగా ఆసియా కప్ లో భారత్ తో మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్థాన్.. పుంజుకుని తన తర్వాత మ్యాచ్ లో హాంకాంగ్ ను చిత్తు చేసింది. దాంతో సూపర్-4 లో మళ్లీ భారత్-పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇక పాక్-హాంకాంగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ అంత భారీ స్కోర్ చేయడానికి ఒకే ఒక్క బ్యాటర్ కారణం.. అతడే ఖుష్ దిల్ షా.. చివరి మూడు ఓవర్లు ఉన్నాయనంగా వచ్చిన ఈ పాక్ ఆటగాడు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ గురించి, అలాగే ఇండియాతో జరగబోయే మ్యాచ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. 129-2, 16.1 ఓవర్లకు పాకిస్థాన్ స్కోరు ఇది. అయితే తర్వాత ఓవర్లలో ఎంత స్కోరు చేస్తుంది అనుకుంటారు ఎవరైనా 160, లేదా 170. కానీ పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది అంటే అది పాక్ బ్యాటర్ ఖుష్ దిల్ షా చలవే. అతడు వచ్చీ రాగానే హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్స్ లే లక్ష్యంగా తన బ్యాటింగ్ ను కొనసాగించాడు. అతడి ఊచ కోతకు బలైన ప్రధాన బౌలర్ అజీజ్ ఖాన్. అతడు చివరి ఓవర్ వేయడానికి వచ్చాడు. బ్యాటింగ్ ఎండ్ లో ఉన్న షా అతడి విశ్వరూపాన్నే చూపాడు. చివరి ఓవర్లో ఏకంగా నాలుగు భారీ సిక్స్ లను బాదాడు. దాంతో ఆ ఓవర్లో పాక్ ఏకంగా 29 రన్స్ ను పిండుకుంది. ఇక ఖుష్ దిల్ షా కేవలం 15 బంతుల్లోనే 5 సిక్స్ లతో 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ..'' నేను బ్యాటింగ్ కు వెళ్లే ముందు మా కెప్టెన్ బాబర్ నాకు ఓ మాట చెప్పాడు. నువ్వు ప్రారంభం నుంచే ఎదురుదాడి చేయ్యి అని. అతడు చెప్పినట్లుగానే నేను నా పనిని ముంగించాను. అప్పటికే పిచ్ కూడా మాకు సహకరిస్తోంది. దాంతో బౌలర్ల పై దాడికి మాకు సులువు అయ్యింది. భారత్ తో జరగబోయే మ్యాచ్ లో కూడా ఈ విధంగానే చెలరేగుతాను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఇతడిపై నెటిజన్స్ స్పందిస్తూ.. భాయ్ అక్కడ ఉంది మామ్ములు బౌలర్లు కాదు నువ్వు కొడదానికి'' అనగా మరికొందరు మీ బ్యాటర్లను అడుగు మా బౌలర్ల గురించి'' అంటూ రాసుకొచ్చారు. ఖుష్ దిల్ షా ప్రపంచ స్థాయి బౌలర్లు అయిన భారత పేస్ దళాన్ని ఏ మేరకు రాబోయే మ్యాచ్ లో ఎదుర్కొంటాడో వేచి చూడాలి. మరి ఖుష్ దిల్ షా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 29 Runs in Last Over !! ❤️⚡ Khushdil Shah You Beauty ❤️ pic.twitter.com/1UTQ8pOHIn — ✨ (@Cric_vibes) September 2, 2022 ️ @mnawaz94 and @KhushdilShah_ review Pakistan's victory over Hong Kong and look ahead to the Super 4 stage of #AsiaCup2022 pic.twitter.com/2qWW9vfqZ8 — Pakistan Cricket (@TheRealPCB) September 2, 2022 ఇదీ చదవండి: టీమిండియా రికార్డును బ్రేక్ చేసిన పాకిస్థాన్! నంబర్ 2గా.. ఇదీ చదవండి: Rashid Khan: భారత్ తో మ్యాచ్ కి ముందే రషీద్ ఖాన్ షాకింగ్ కామెంట్స్