Australia vs New Zealand 2nd ODI: స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కంగారూల నిర్ధేశించిన 196 పరుగుల లక్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 82 పరుగులకే కుప్పకూలింది. అయితే.. ఈ మ్యాచులో కివీస్ సారధి కేన్ విలియమ్సన్ రనౌట్ నుంచి తప్పించుకున్న తీరు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫీల్డింగ్ చూశాక.. మీరు క్రికెట్ ప్లేయర్ అయితే, మనకు ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు రాదే అని బాధపడతారు. విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 196 పరుగుల లక్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ను కోల్పోతుంది. ఆ తర్వాత క్రీజులో వచ్చిన కేన్ విలియమ్సన్, ఆడిన తొలి బంతికే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్ ఆఖరి బంతిని కవర్స్ కు ఆడిన విలియమ్సన్.. నాన్ స్ట్రైక్ లో ఉన్న డెవన్ కాన్వేను పట్టించుకోకుండానే సింగిల్ కోసం పరుగెడుతాడు. ఆపై.. తేరుకున్న కాన్వే.. పరుగు కోసం ప్రయత్నించినా.. వెనుకకు.. ముందుకు పరుగెత్తడంతో ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఆ సమయంలో.. షార్ట్ ఎక్స్ట్రా కవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న సీన్ అబాట్ తొలిసారి బంతిని అందుకోవడంలో విఫలమయినా.. మళ్ళీ అందుకొని స్ట్రైకింగ్ ఎండై వైపు బాల్ విసురుతాడు. అయితే ఈసారి కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు కొట్టడంలో విఫలమవుతాడు. దీంతో కివీస్ కెప్టెన్ కేన్ మామ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. Mayhem in the middle #AUSvNZ pic.twitter.com/FzBY9SuKHD — cricket.com.au (@cricketcomau) September 8, 2022 కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 61 పరుగులతో టాస్స్కోరర్ గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ 25 పరుగులు చేశాడు. ఆపై.. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 33 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలి 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కేన్ విలియమ్సన్ 17, మిచెల్ సాంట్నర్ 16 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. 3 వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే.. 2-0తో సొంతం చేసుకుంది. ఇరు జట్ల మూడో వన్డే కెయిర్న్స్ వేదికగా సెప్టెంబర్ 11న జరగనుంది. ఈ రనౌట్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Nearly run out first ball, grafted for 17 (58), dug himself into a hole, eventually LBW after missing a full toss and unsuccessfully reviewed to top it all off. Has to be a contender for worst ODI knock ever from Kane Williamson. #AUSvNZ pic.twitter.com/dltFaLgc0W — Daniel (@DannySenior) September 8, 2022 It's one of the BIGGEST ODI turnarounds you'll ever see Australia was 8-117, and then won by 113 runs... astonishing. The Chappell-Hadlee Trophy is theirs REPORT https://t.co/E0YAJ7epvH #AUSvNZ pic.twitter.com/a3gzmBb0BN — Fox Cricket (@FoxCricket) September 8, 2022 ఇదీ చదవండి: ఆసియా కప్‌లో టీమిండియా వైఫల్యానికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ ఇదీ చదవండి: వీడియో: కెప్టెన్ వాడు కాదు.. నేనంటూ అంపైర్‌కు మొరపెట్టుకున్న బాబర్ అజమ్!