బీసీసీఐ పంట పండుతోంది. ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా బోర్డుకు వచ్చే మొత్తంపై ఇప్పటికే భారీ అంచనాలుండగా.. వేలం ఆ అంచనాలకు మించి సాగుతోంది. కళ్లు చెదిరే రీతిలో వేల కోట్ల సొమ్ము బోర్డు ఖజానాలో చేరబోతోంది. 2023-2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సంస్థల తీవ్ర పోటీ ఉండడంతో బిడ్డింగ్ లో ఒక్క మ్యాచ్ విలువ ఏకంగా రూ.100 కోట్లు దాటేసింది. కేవలం రెండు ప్యాకేజీలకు కలిపి తొలి రోజు పలికిన ధర రూ.43,050 కోట్లు. టీవీ ప్రసారాలతో సమానంగా డిజిటల్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది. గత హక్కుల విలువ పోలిస్తే ఇప్పటికే విలువ రెండున్నర రెట్లు ఎక్కువ. 2023-2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏ, బి, సి, డి అనే నాలుగు విభాగాల్లో హక్కుల కోసం వేలం నిర్వహిస్తోంది. అందులో ప్యాకేజీ-‘ఏ’లో స్వదేశంలో టీవీ ప్రసార హక్కులు, ప్యాకేజీ-‘బి’లో స్వదేశంలో డిజిటల్ హక్కులు, ప్యాకేజీ-‘సి’లో నాన్-ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ హక్కులు, ప్యాకేజీ-‘డి’లో ఓవర్సీస్ టీవీ, డిజిటల్ హక్కులు ఉన్నాయి. ఈ వేలంలో.. ప్రధానంగా ముఖేశ్ అంబానీకి చెందిన వయాకామ్ 18, డిస్నీ స్టార్, సోనీ, జీ పోటీపడుతున్నాయి. రెండ్రోజుల వేలం ప్రక్రియలో భాగంగా .. తొలి రోజు ఎ(స్వదేశంలో టీవీ ప్రసార హక్కులు), బి(స్వదేశంలో డిజిటల్ హక్కులు) ప్యాకేజీలకు వేలం నిర్వహించింది. 'ఎ' ప్యాకేజీలో భాగంగా ఒక్కో మ్యాచ్ లో టీవీ హక్కుల కోసం ప్రారంభ ధరను రూ. 49 కోట్లు, డిజిటల్ హక్కులను రూ. 33 కోట్లుగా నిర్ణయిచింది. IPL - Biggest Cricket League For A Reason #IPL #SouravGanguly #IPLMediaRights pic.twitter.com/KhQXOM1uwe — Oh My Cricket (@OhMyCric) June 13, 2022 ఇది కూడా చదవండి: Sourav Ganguly: IPL ఆదాయం లెక్కలపై సౌరవ్ గంగూలీ ఓపెన్ కామెంట్స్! కాగా 'ఎ' ప్యాకేజీలో ఇప్పటికే రూ. 57 కోట్ల వద్ద, ‘బి’ ప్యాకేజీలో రూ. 48 కోట్ల వద్ద బిడ్డింగ్ నిలిచింది. ఈ రెండు ప్యాకేజీలు కలిపి చూస్తే ఒక్కో మ్యాచ్ కు బిడ్డింగ్ రూ.100 కోట్లు (టీవీ రూ.57 కోట్లు, డిజిటల్ రూ.48 కోట్లు) దాటింది. తొలి రోజు వేలం ముగిసేనాటికి ఎ ప్యాకేజీ లో రూ. 23,370 కోట్లు.. బి ప్యాకేజీలో రూ.19,700 కోట్ల వరకు బిడ్డింగ్ సాగింది. మొత్తంగా.. రూ. 43,050 కోట్ల వద్ద బిడ్డింగ్ నిలిచింది. వేలం నుంచి ఇంకా ఏ సంస్థ కూడా తప్పుకోకపోవడంతో సోమవారం కూడా ఇది కొనసాగుతుంది. నేడు కూడా కొనసాగనున్న ఈ బిడ్డింగ్‌లో.. టీవీ, డిజిటిల్ హక్కుల కోసం బిడ్డింగ్ రూ.50 వేల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు సి, డి ప్యాకేజీల కనీసం రూ.5500 కోట్లు వస్తాయన్నది అంచనా. కాగా.. 2017-22 వరకు ఐదేండ్లకు గానూ డిస్నీ స్టార్ రూ. 16,347 కోట్లకు ఐపీఎల్ హక్కులు దక్కించుకోగా.. ఇప్పుడా ధర మూడు రెట్లు పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది. IPL Media Rights pic.twitter.com/vmXgxWsVwG — RVCJ Media (@RVCJ_FB) June 12, 2022 #IPLMediaRights At Rs 104 crore, #IPL overtakes #EPL in per match value @IPL is now only the second after the US's @NFL in terms of per match value Details ➡️ https://t.co/EvcewQpMPn pic.twitter.com/ya0n1jEm2O — The Times Of India (@timesofindia) June 13, 2022