పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పంత్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లు లేని టీమిండియా విండీస్‌పై 300పై చిలుకు పరుగులు చేసి అదరగొట్టింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ధావన్, శుభ్‌మన్ తొలి వికెట్‌కు 119 పరుగుల భారీ స్కోర్ అందించారు. కాగా 18వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ నిర్లక్ష్యంగా పరిగెత్తి రన్‌అవుట్ అయ్యాడు. పూరన్ అద్భుత త్రోతో గిల్‌ను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత ధావన్‌తో జతకలిసిన శ్రేయస్ అయ్యర్ చూడచక్కటి షాట్లతో అలరించాడు. సెంచరీకి చేరువైన ధావన్.. మోతీ వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో కట్ షాట్ ఆడబోయి పాయింట్ వద్ద షమర్ బ్రూక్స్ అద్భుత క్యాచ్‌కు అవుట్ అయ్యాడు. దీంతో కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గా ప్రదర్శన చేయలేదు. సూర్యకుమార్ యాదవ్(13), సంజూ శాంసన్(12) దీపక్ హుడా(27), అక్షర్ పటేల్(21) పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక శార్థుల్ ఠాకూర్(7 నాటౌట్), సిరాజ్(1 నాటౌట్) నిలిచారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో జోసెఫ్ 2, మోతీ 2, షెఫర్డ్, హూసేన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. భారీ లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ టీమిండియా ధీటుగానే సమాధానం ఇచ్చింది. కైల్ మేయర్స్(75), షమర్ బ్రూక్స్(46), బ్రాండన్ కింగ్(54) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసి 3 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. చివరల్లో అకేల్ హోసేన్(32 నాటౌట్), షెపర్డ్(39 నాటౌట్) ధాటిగా ఆడి.. విండీస్‌ను విజయం వైపు నడిపించారు. కానీ.. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైన దశలో భారత బౌలర్ సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి.. కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఇక భారత బౌలర్లలో సిరాజ్ 2, శార్థుల్ ఠాకూర్ 2, యుజ్వేంద్ర చహల్ 2 వికెట్లు పడగొట్టారు. భారత కెప్టెన్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెంచరీ చేయకపోవడం నిరాశ కలిగించింది.. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. మ్యాచ్ గెలవడం సంతోషాన్ని ఇచ్చిందని అలాగే సెంచరీని కొద్దిలో మిస్ చేసుకోవడం కొంత నిరాశ కలిగించిందని ధావన్ అన్నాడు. మ్యాచ్ చివర్లో కొంత కంగారు పడ్డాం. కానీ.. మా ప్లాన్‌ను వర్క్ చేసి సక్సెస్ అయ్యాం అని తెలిపాడు. అలాగే రాబోయే మ్యాచ్‌ల్లోనూ మరింత మెరుగ్గా రాణిస్తామని అన్నాడు. మరి టీమిండియా విజయంపై, ధావన్ సెంచరీ మిస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. India win a thriller to take a 1-0 lead in the three-match ODI series Watch #WIvIND for FREE on https://t.co/MHHfZPyHf9 (in select regions) | Full scorecard: https://t.co/vjur84Qla6 pic.twitter.com/n3gCzNySht — ICC (@ICC) July 22, 2022 Mohammed Siraj had four to defend off the final ball against Romario Shepherd; he went for the yorker and conceded only one https://t.co/QhCNh3iJMe #WIvIND pic.twitter.com/pBUhEiTmlU — ESPNcricinfo (@ESPNcricinfo) July 22, 2022 Captain @SDhawan25 falls three short of his century as he departs after scoring a fine 97. Live - https://t.co/tE4PtTfY9d #WIvIND pic.twitter.com/Z47MkSZIPb — BCCI (@BCCI) July 22, 2022