మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా 2011లో వన్డే వరల్డ్ గెలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో భారత్ రెండో సారి విశ్వవిజేతగా నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధోని సిక్స్ కొడుతూ మ్యాచ్ గెలిపించే దృశ్యం ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్లలో మెదులుతూనే ఉంటుంది. ఎప్పుడో 1983లో గెలుపు మధురక్షణాలు ఆస్వాదించిన ఇండియన్ క్రికెట్ అభిమానులు మళ్లీ 2011లో అలాంటి అనుభూతిని పొందారు. దేశం మొత్తం టీమిండియాను కీర్తించింది. కాగా.. టీమిండియా 2011 వరల్డ్ కప్ ఫైనల్ చేరుతుందని 2010లోనే క్రిక్‌బజ్ ట్విట్టర్‌లో తెలిపింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పట్టుకున్నదల్లా బంగారమే అనే నానుడి అతని కెప్టెన్సీ సమయంలో ఉండేది. దానికి కారణం ధోని కెప్టెన్సీ తీసుకున్న వెంటనే టీమిండియా 2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. ఆ మరుసటి ఏడాది 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్‌లో ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఏడాదిలోనే 6 జట్లను వెనక్కునెట్టి ఫైనల్ చేరింది. ఆ తర్వాత ఛాంపియన్స్ లీగ్ టీ20లో కూడా పాల్గొన్న తొలి ఏడాదిలోనే ఫైనల్ చేరింది. ఇలా అడుగుపెట్టిన చోటల్లా మంచి ఫలితాలు సాధిస్తూ.. ధోని చూసి అసలు సుడి మొత్తం ధోనిలోనే ఉందని అంతా భావించారు. అలాగే క్రిక్‌బచ్ కూడా.. 2007 టీ20 వరల్డ్, ఐపీఎల్ 2008 ఫైనల్, ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో ధోని కెప్టెన్సీలోని జట్టు ఫైనల్ చేరడం చూస్తుంటే.. 2011 వన్డే వరల్డ్ కప్‌లో కూడా ధోని సారథ్యంలోని టీమిండియా ఫైనల్ చేరుతుందని క్రిక్ బజ్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 2011లో వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్ చేరుతుందని క్రిక్‌బచ్ భలే ఊహించిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలాగే ధోని కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ఎప్పుడో దేవుడు ఫిక్స్ చేశాడని మరికొంత మంది సోషల్ మీడియా వేదిక పేర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: కూల్‌గా ఉండే సచిన్‌కు ఆ రోజు కోపం వచ్చింది! గ్రౌండ్‌లో విధ్వంసమే జరిగింది! View this post on Instagram A post shared by Fukkard (@fukkard)