సచిన్ టెండూల్కర్, యువరాజ్‌సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ లాంటి దిగ్గజాల ఆటను మరోసారి చూసే అవకాశం దక్కింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇండియా లెజెండ్స్-సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ టీమ్ భారీ విజయం సాధించి.. సిరీస్‌లో శుభారంభం చేసింది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత రోడ్డు రవాణ, హైవేలు, ఐటీ మంత్రిత్వ శాఖ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 సీజన్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓ సీజన్ ఘనంగా ముగించుకున్న ఈ టోర్నీ మళ్లీ అభిమానులను పలకరించింది. ఈ సిరీస్ రెండో సీజన్‌లో ఇండియన్ లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు బరిలోకి దిగాయి. ఆయా దేశాల దిగ్గజ, మాజీ ఆటగాళ్లు వారి వారి దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాన్పూర్ వేదికగా ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు సచిన్, యువరాజ్‌పై ఉన్నాయి. వాళ్లు చెలరేగి ఆడితే చూడాలని అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కానీ.. సచిన్ నిరాశ పర్చిన మరో టీమిండియా మాజీ ఆటగాడు స్టువర్ట్ బిన్నీ సంచలన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా లెజెండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్‌తో కలిసి నమాన్ ఓజా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. కాగా.. సచిన్ 16 పరుగులు మాత్రమే చేసి త్వరగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓజా (21), సురేష్ రైనా (33), యువరాజ్ సింగ్ (6) సైతం తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఒక పక్క స్టువర్ట్ బిన్నీ చెలరేగుతుంటే.. చివర్లో యూసుఫ్ పఠాన్ 15 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇండియా లెజెండ్స్ భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. ఇండియా లెజెండ్స్ 61 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. స్టువర్ట్ బిన్నీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారత బౌలర్లలో రాహుల్ శర్మ 3, మునాఫ్ పటేల్ 2, ఓజా 2, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా లెజెండ్స్ బ్యాటర్లలో జాంటీ రోడ్స్ 38 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. మరి ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. LIVE SCORE India Legends vs South Africa Legends Sachin’s IND wins toss, to bat in Road Safety World Series; Playing XI updatehttps://t.co/sF49Qh6FQi#LegendsLeagueCricket pic.twitter.com/fWK2ChxYci — Sportstar (@sportstarweb) September 10, 2022 Sachin Tendulkar, Suresh Raina, Yuvraj Singh returns tonight on the field with Road Safety World Series match. Today India Legends vs South Africa Legends, 1st Match at 7.30 PM IST. pic.twitter.com/CWxXktMyv3 — Times of Sports (@timesofsports) September 10, 2022 India legends vs south africa legends RSWS pic.twitter.com/chNi5Ul7sG — Waman Jadhav (@WamanJadhav7) September 10, 2022