ఇంగ్లాండ్, బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ క్రీడలు ముగిశాయి. మొత్తం 40 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 200 మందికి పైగా అథ్లెట్లు, భారీ ఆశలతో అడుగుపెట్టినా.. మొత్తానికి 61 పతకాలతో పర్వాలేదనిపించింది. ఇందులో 50కి పైగా అథ్లెట్లు మొదటిసారి కామన్వెల్త్‌లో అడుగుపెట్టి పతకాలు గెలిచారు. కామన్ వెల్త్ గేమ్స్ 2022లో భారత్ మొత్తంగా 61పతకాలు గెలుపొందింది. అందులో 22 గోల్డ్ మెడల్స్ కాగా.. 16సిల్వర్, 23బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఇక మెడల్స్ ట్యాలీలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా(178), ఇంగ్లాండ్(176), కెనడా(92) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కామన్వెల్త్ చరిత్రలో మొట్టమొదటి సారి లాంగ్ జంప్, హై జంప్, లాన్ బౌల్స్, స్టీఫుల్‌ఛేజ్, రేస్ వాక్ ఈవెంట్లలో పతకాలు గెలిచిన భారత్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్లలో అద్భుత విజయాలు అందుకుంది. పథకాలు సాధించిన క్రీడాకారులు గోల్డ్ - (22) వెయిట్ లిఫ్టింగ్ (3): మీరాబాయి చాను, అచింత షూలీ, లాల్‌రినుంగ జెరెమీ రెజ్లింగ్ (6): వినేష్ ఫోగట్, రవి కుమార్ దహియా, నవీన్ కుమార్, సాక్షి మాలిక్, దీపక్ పూనియా, బజరంగ్ పూనియా బాక్సింగ్ (3): నిఖత్ జరీన్, అమిత్ పంఘాల్, నీతూ ఘంఘాస్ టేబుల్ టెన్నిస్ (4): శరత్ కుమార్ ఆచంట, మిక్స్‌డ్ డబుల్స్ (శరత్, శ్రీజ ఆకుల), భవీనా పటేల్ (మహిళల సింగిల్స్ క్లాసెస్ 3-5), పురుషుల టీం (హర్మీత్ దేశాయ్, సనీల్ శెట్టి, శరత్ కమల్ ఆచంట, సాతియాన్ జ్ఞానశేఖర్ లాన్ బౌల్స్: మహిళల ఫోర్స్ టీం (లవ్లీ చౌబే, రూపా రాణీ, పింకీ, నయన్‌మోని సైకా) పారా పవర్‌లిఫ్టింగ్: సుధీర్ బాడ్మింటన్ (3): పురుషుల డబుల్స్ (సాత్విక్ రెడ్డి, చిరాగ్ శెట్టి), లక్ష్యసేన్, పీవీ సింధు అథ్లెటిక్స్: ఎల్డ్‌హోస్ పాల్ సిల్వర్ - (16) హాకీ: పురుషుల టీం క్రికెట్: మహిళల టీం అథ్లెటిక్స్ (4): అబ్దుల్లా అబూబకర్, అవినాష్ ముకుంద్, ప్రియాంక, శ్రీశంకర్, బాడ్మింటన్: మిక్స్‌డ్ టీం (కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ రెడ్డి, సుమీత్ రెడ్డి, లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, ట్రీసా జాలీ, ఆకర్షి కశ్యప్, మచిమండ పొన్నప్ప, పుల్లెల గాయత్రి, పీవీ సింధు) బాక్సింగ్: సాగర్ ఆహ్లావత్ జూడో (2): తులికా మాన్, సుశీలా దేవి లాన్ బౌల్స్: పురుషుల ఫోర్స్ టీం( (లవ్లీ చౌబే, రూపా రాణీ, పింకీ, నయన్‌మోని సైకా)) టేబుల్ టెన్నిస్: పురుషుల డబుల్స్ (శరత్ కమల్, సాతియాన్ జ్ఞానశేఖరన్) వెయిట్ లిఫ్టింగ్ (3): వికాస్ ఠాకూర్, బింద్యారాణి దేవి, సంకేత్ మహాదేవ్ సర్గార్ రెజ్లింగ్: అన్షు మాలిక్ బ్రాంజ్ - (23) హాకీ: మహిళల టీం రెజ్లింగ్(5): దీపక్ నెహ్రా, పూజా సిహాగ్, పూజా గెహ్లాట్, మోహిత్ గ్రెవాల్, దివ్య కక్రాన్ వెయిట్‌లిఫ్టింగ్ (4): గుర్దీప్ సింగ్, లవ్‌ప్రీత్ సింగ్, హర్జీందర్ కౌర్, గురురాజ పూజారి టేబుల్ టెన్నిస్ (2): సాతియాన్ జ్ఞానశేఖరన్, సోనాల్‌బేన్ మనుభాయి పటేల్ జూడో: విజయ్ కుమార్ యాదవ్ స్క్వాష్ (2): మిక్స్‌డ్ డబుల్స్ (దీపికా పల్లికల్, సౌరవ్ ఘోసల్), సౌరవ్ ఘోసల్ బాక్సింగ్ (3): రోహిత్ టోకాస్, హుస్సాముద్దీన్ మహమ్మద్, జాస్మిన్ లంబోరియా బాడ్మింటన్ (2): మహిళల డబుల్స్ (జాలీ ట్రీసా, పుల్లెల గాయత్రి), కిదాంబి శ్రీకాంత్ అథ్లెటిక్స్: అన్ను రాణి, సందీప్ కుమార్, తేజస్విన్ శంకర్ India finish 4th at the Commonwealth Games 2022 with 22 Gold, 16 Silver and 23 Bronze Medals! #CWG2022 #B2022 pic.twitter.com/0Wy4EiRrbH — Sportskeeda (@Sportskeeda) August 8, 2022