టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ జట్టు 284 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 245 పరుగులు మాత్రమే చేయగలిగింది. 377 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ సునాయాసంగా మ్యాచ్ ను గెలిచేసింది. మొదట 3 వికెట్లు త్వరగానే కోల్పోయినా.. ఆ తర్వాత ఒక్క వికెట్ కూడా పడకుండా ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. జో రూట్(142*), జానీ బెయిర్ స్టో(114*) విజృంభించడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమం అయ్యింది. ఈ టెస్టుకు సంబంధించి ప్రస్తుతం జో రూట్ ఆడిన ఒక షాట్ బాగా వైరల్ అవుతోంది. అసలు ఆ బాల్ ఎలా సిక్స్ కొట్టావ్ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. So @root66's series stats are an absolute joke! #ENGvIND pic.twitter.com/jzKru38I85 — England Cricket (@englandcricket) July 5, 2022 శార్దుల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్ లో తన 10వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఓవర్లో నాలుగో బంతిని స్లోగా అండ్ లెంగ్త్ డెలివిరీ వేశాడు. జో రూట్ వెంటనే రివర్స్ స్కూప్ షాట్ తో ఆ బంతిని కాస్తా బౌండిరీ అవతల పడేశాడు. ఇంకేముంది ఆ షాట్ చూసిన గ్యాలరీలోని ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోయారు. నెటిజన్లు అయితే రివర్స్ స్కూప్ లో అలా సిక్స్ ఎలా కొట్టావ్ మావా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జో రూట్ సిక్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Just a reverse scoop for 6️⃣ off a seamer while we chase a record total Scorecard/Clips: https://t.co/jKoipF4U01 #ENGvIND pic.twitter.com/DCKPKExRxz — England Cricket (@englandcricket) July 5, 2022 ఇదీ చదవండి: ఇంగ్లాండ్ నయా స్టార్ జానీ బెయిర్‌స్టో లవర్ ఎవరో తెలుసా? ఇదీ చదవండి: కోహ్లీ రికార్డు బ్రేక్ చేయడంపై బాబర్ అజామ్ ఓవరాక్షన్!