ఇండియా Vs ఇంగ్లాండ్ రీషెడ్యూల్ట్ మ్యాచ్ లో టీమిండియా సత్తా చాటింది. మొదట తడబడిన టీమిండియా జట్టు ఆ తర్వాత నిలదొక్కుకుని తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్(111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146), రవీంద్ర జడేజా(194 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 104 పరుగులు) ఇండియాకి మంచి స్కోర్ ని అందించారు. ఆ తర్వాత బుమ్రా కెప్టన్ ఇన్నింగ్స్ ప్రేక్షకులను అలరించింది. కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేసి తన బ్యాటింగ్‌తో టీ20ని తలపించాడు. అసలు ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కి అయితే పగలే చుక్కలు చూపించాడు. బుమ్రా కాసేపు స్టువర్ట్ బ్రాడ్ కి యువరాజ్ సింగ్ ని గుర్తు చేశాడు. యువరాజ్ 6 బంతుల్లో 36 పరుగులు చేయగా.. ఐదో టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో 6 బంతుల్లో 35 పరుగులు వచ్చాయి. కేవలం ఒక్క పరుగు అధికంగా వచ్చి ఉంటే యువరాజ్ టీ20ల్లో 6 బంతులకు 36 పరుగులు చేసిన రికార్డు సొంతం అయ్యేది. బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 35 run over given by Broad in a test match & guess the batsman, our new captain Jasprit Bumrah pic.twitter.com/U83NdczK8W — Jebey Cherian (@jebeycherian) July 2, 2022