క్రికెట్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ దగ్గరికొచ్చేసింది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం ఈ క్రేజీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు గతంలోనే హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన కొద్ది నిమిషాల్లోనే క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడిమరి కొన్నారు. కాగా ఆసియా కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో కూడా భారత్-పాకిస్థాన్ లీగ్ దశలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఫిబ్రవరిలో టికెట్లు విడుదల చేయగా.. కేవలం ఐదు నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టికెట్లు దొరక్క చాలా మంది క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. అలాంటి వారి కోసం ఐసీసీ ఒక శుభవార్త చెప్పింది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ చూడాలనుకునే అభిమానులకు మరో అవకాశం కల్పించింది. మరో నాలుగు వేలకు పైగా స్టాండింగ్ రూమ్ టికెట్లను విడుదల చేసినట్లు ఐసీసీ వెల్లడించింది. ఒక్కో టికెట్ ధర 30 ఆస్ట్రేలియన్ డాలర్లుగా(మన కరెన్సీలో దాదాపు రూ.1670) పేర్కొంది. వీటితో పాటు ఐసీసీ హాస్పిటాలిటీ, ఐసీసీ ట్రావెల్స్ అండ్ టూర్స్ ప్రోగ్రామ్స్ తరపున పరిమిత సంఖ్యలో ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఐపీసీ పేర్కొంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫిబ్రవరిలో టిక్కెట్లు దొరక్క నిరాశ చెందిన వారంతా ఇప్పుడు మరోసారి టిక్కెట్ల కోసం ప్రయత్నించండి. కాగా భారత్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎప్పుడూ ఫుట్ డిమాండ్ ఉంటుంది. పైగా కొంతకాలం నుంచి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేని కారణంగా.. కేవలం ఐసీసీ మెగా టోర్నీల్లోనే భారత్-పాక్ పోరు చూసేందుకు అవకాశం కలుగుతోంది. దీంతో క్రికెట్ అభిమానులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. మరి టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల సంఖ్యను పెంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: బ్రేకప్ చేప్పేసుకున్న శుభ్ మన్ గిల్-సారా టెండూల్కర్! నాకు భవిష్యత్తే ముఖ్యమన్న గిల్ Our journey through Japan The best of the action caught on camera as the ICC Men's #T20WorldCup Trophy Tour, driven by @Nissan, visited Japan. pic.twitter.com/REhOtMt9Zj — T20 World Cup (@T20WorldCup) August 25, 2022