ఇండియా టూర్ ఆఫ్ ఐర్లాండ్ 2022లో భాగంగా జరుగుతున్న రెండు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. పసికూన అనుకున్న ఐర్లాండ్ సైతం చాలా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. వర్షం కారణం వల్ల 12 ఓవర్లకు కుదించగా.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఆ తర్వాత 9.2 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ గెలిచింది ఇండియా అయినా కూడా.. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ పేరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన బౌలర్లకు చుక్కలు చూపించిన హ్యారీ టెక్టర్ ప్రేక్షకుల మన్ననే కాదు.. అటు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాని మెప్పించాడు. ఐర్లాండ్ జట్టు చేసిన 108 స్కోరులో సగానికి పైగా హ్యారీ టెక్టర్ కొట్టినవే. కేవలం 33 బంతుల్లోనే 6 ఫోర్లు, 3సిక్సర్లతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని టీ20 కెరీర్లో చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం. మన బౌలర్లని ఆ రేంజ్లో చితకొట్టిన హ్యారీ టెక్టర్‌ను హార్దిక్ పాండ్యా మెచ్చుకున్నాడు. ఊరికే మాటవరసకి మెచ్చుకోవడం కాదు.. తన బ్యాట్ అతనికి గిఫ్ట్ గా ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా.. తన బ్యాటుతో ఇంకో నాలుగు సిక్సులు కొట్టి తర్వాతి సంవత్సరం ఐపీఎల్ కాంట్రాక్ట్ కొట్టేయాలంటూ ఆకాంక్షించాడు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) హార్దిక్ పాండ్యా హ్యారీ టెక్టర్ ను మెచ్చుకుని బ్యాట్ గిఫ్ట్ గా ఇవ్వడంతో అతని పేరు ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతేకాకుండా నెక్ట్స్ ఇయర్ తప్పకుండా అతను ఐపీఎల్ ఆడతాడేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా గుజరాత్ టైటాన్స్ జట్టే ఆ అవకాశం కల్పిస్తుందేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రెండో టీ20లోనూ హ్యారీ టెక్టర్ భారత బౌలర్లపై చెలరేగి ఆడితే ఆ ఊహాగానాలు నిజమైనా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. View this post on Instagram A post shared by HARRY TECTOR (@harrytector) ఇంక మ్యాచ్ గురించి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా టెక్టర్ స్పందించాడు. నిన్న జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. కానీ మ్యాచ్ గెలవలేకపోయినందుకు కాస్త బాధగా ఉంది. అయినా మా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని రేపు జరగబోయే మ్యాచ్(రెండో టీ20)లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు’ అంటూ హ్యారీ టెక్టర్ పోస్ట్ చేశాడు. హ్యారీ టెక్టర్ కు హార్దికా పాండ్యా బ్యాట్ గిఫ్ట్ గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) ఇదీ చదవండి: ఇంగ్లండ్‌లో ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్న కోహ్లీ! ఇదీ చదవండి: అక్తర్‌ను ఆరేశాడు.. ఉమ్రాన్‌ను ఊదేశాడు! 201 స్పీడ్‌తో భువీ బౌలింగ్