క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన సంఘటనలు, ఔరా అని నోరెళ్లబెట్టే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇంక ఫీల్డింగ్ విషయానికి వస్తే.. ఎన్నో అద్భుతమైన బౌండరీ సేవ్లను, ఎన్నో గ్రేట్ క్యాచ్ లను చూశాం. ఇప్పుడు చెప్పుకోబోయే క్యాచ్ గురించి మాత్రం మీరు ఈ జన్మలో వినుండరు, చూసుండరు. ఇంగ్లాండ్ లోని అల్డ్విక్ క్రికెట్ క్లబ్, లింగ్ఫీల్డ్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. క్యాచ్ మిస్ చేసిన ఫీల్డర్ మళ్లీ తేరుకుని ఆ క్యాచ్ ఒడిసిపట్టుకుని బ్యాటర్ ను పెవిలియన్ కు పంపాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండానే.. బ్యాట్స్ మన్ వెనక్కివెళ్లిపోయాడు. అసలు ఏం జరిగిందంటే.. అల్డ్విక్ బౌలర్ అలెక్స్ రైడర్ వేసిన బంతిని లింగ్ఫీల్డ్ బ్యాటర్ బలంగా కొట్టడంతో బంతి గాల్లోకి లేచింది. ఆ బంతిని అందుకోబోయిన అలెక్స్.. ఎక్కువ హైట్ వెళ్లడంతో డ్రాప్ చేశాడు. అతను బంతిని పట్టుకోబోయి కిందపడ్డాడు. ఆ క్రమంలో అతని కాళ్లు గాల్లోకి లేచాయి. బంతి అలెక్స్ కాలిపై పడి మళ్లీ గాల్లోకి లేచింది. వెంటనే తేరుకున్న బౌలర్ ఆ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. రన్ తీస్తూ అదంతా చూసిన బ్యాటర్ ఏం జరిగిందో తెలియకుండానే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా.. ఇలాంటి క్యాచ్ మేమెప్పుడూ చూడలే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వింత క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Presenting the greatest dropped catch ever!! What a take Vs @LingfieldCC today by 16 year old Alex Ryder.#TakeABow pic.twitter.com/Nw1XN0Xhsn — Aldwick Cricket Club (@AldwickCC) June 15, 2022 ఇదీ చదవండి: ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన ఆసీస్ క్రికెటర్.. 140 బంతుల్లో 309 రన్స్! ఇదీ చదవండి: మరో సెంచరీ కొట్టిన క్రీడా మంత్రి మనోజ్ తివారి! వెరైటీ సెలబ్రేషన్స్ వైరల్!