నెదర్లాండ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండు జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. పసికూన నెదర్లాండ్ బౌలర్లపై ఇంగ్లాండు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వన్డేలలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అమ్స్టెల్వీన్ లో జరుగుతున్న తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగులు భారీ స్కోరు చేసింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యధిక స్కోరు (498) చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాక వన్డేలలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. ఇంగ్లాండ్ మరో రెండు పరుగులు గనక చేసి ఉంటే వన్డే క్రికెట్ చరిత్రలో 500 పరుగులు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించేది. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అమ్స్టెల్వీన్లో జరుగుతున్న తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగుల భారీ స్కోరు చేసింది. శుక్రవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు.. పసికూన నెదర్లాండ్‌కు చుక్కలు చూపెట్టింది. ఆ జట్టులో ఫిలిప్ సాల్ట్, మలన్, జోస్ బట్లర్ లు సెంచరీలు చేశారు. చివర్లో లివింగ్ స్టోన్ కూడా రెచ్చిపోయి ఆడటంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. ఇది కూడా చదవండి: Steffan Nero: ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన ఆసీస్ క్రికెటర్.. 140 బంతుల్లో 309 రన్స్! Eng vs Netherlands Eng 498/5 Butler gadu 162 off 70 balls pic.twitter.com/SVj7PFDZeS — nars (@denimstreett) June 17, 2022 టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్.. రెండో ఓవర్లోనే జేసన్ రాయ్ (1) వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో నెదర్లాండ్‌కు ఏదైనా మంచి, సంతోషకరమైన సంఘటన అంటే కేవలం అది మాత్రమే. ఇక ఆ తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాటర్లు వరుస పెట్టి సెంచరీలు బాదారు. ఫిలిప్ సాల్ట్ (93 బంతుల్లో 122.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మలన్ (109 బంతుల్లో 125.. 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ఫామ్‌ను బాగా కంటిన్యూ చేసినట్లున్నాడు. ఏకంగా 70 బంతుల్లో 162 నాటౌట్.. 7 ఫోర్లు, 14 సిక్సర్లుబాదాడు. ఇది కూడా చదవండి: Manoj Tiwary: మరో సెంచరీ కొట్టిన క్రీడా మంత్రి మనోజ్ తివారి! వెరైటీ సెలబ్రేషన్స్ వైరల్! England scored 498 runs in the first ODI against Netherlands It is a World Record for the highest score in ODI Can Netherlands chase it down? #englandcricketteam #netherlandscricketteam #engvsnetherlands #CricketTwitter pic.twitter.com/RcryZE6vgv — Sportskeeda (@Sportskeeda) June 17, 2022 ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి నెదర్లాండ్ బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. ఫిలిప్ బొయ్సెవేన్ 10 ఓవర్లలో 108 పరుగులిచ్చాడు. బాస్ డి లీడె 5 ఓవర్లలో 65.., స్నాటర్ 10 ఓవర్లలో 99.., సీలర్ 9 ఓవర్లలో 83 పరుగులు సమర్పించుకున్నారు. కాగా.. ఈ మ్యాచ్ లో 12 ఓవర్లు ముగిసేసరికి నెదర్లాండ్.. ఒక వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. వరల్డ్ రికార్డు సాధించిన ఇంగ్లాండ్ టీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోర్లు : 1. ఇంగ్లాండ్: 498-4 (నెదర్లాండ్స్-2022) 2. ఇంగ్లాండ్: 481-6 (ఆస్ట్రేలియా-2018) 3. ఇంగ్లాండ్: 444-3 (పాకిస్తాన్ - 2016) 4. శ్రీలంక: 443-9 (నెదర్లాండ్స్ - 2006) 5. సౌతాఫ్రికా: 439-2 (వెస్టిండీస్ - 2015 6. సౌతాఫ్రికా: 438-9 (ఆస్ట్రేలియా-2006) ఇది కూడా చదవండి: ICC T-20: టీమిండియా పరువు కాపాడిన ఇషాన్ కిషన్! కాస్తలో పరువు పోయేది!