క్రీడా రంగంలో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు.. ఇక భారత దేశంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత అభిమానం క్రికెట్ అంటే.. తాజాగా టీంఇండియా ఇంగ్లాండ్ పై టీ20, వన్టే సీరిస్ లు నెగ్గిన విషయం తెలిసిందే. ఇది సంతోషకరమైన విషయమే అయినప్పటికీ భారత జట్టును ఓ గాయం వెంటాడుతూనే ఉంది.. అదే విరాట్ కోహ్లీ ఫామ్.. తాజాగా దినేష్ కార్తీక్ సైతం కోహ్లీ ఫామ్ పై స్పందించాడు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. విరాట్ కోహ్లీ.. అభిమానులు ముద్దుగా 'రన్ మెషిన్' అని పిలుచుకుంటారు. అందుకు తగ్గట్టుగానే అతని ఆట కూడా ఉంటుంది. కానీ గత కొంత కాలంగా విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో అతడిపై విమర్శలు వస్తోన్నాయి. కపిల్ దేవ్ తో మెుదలైన విమర్శలు మరికొంత మంది ఆటగాళ్లతో ముగిశాయి. అలాగే అతనికి మద్దతు పలికే ఆటగాళ్ల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. విరాట్ కు మద్దతుగా కెప్టెన్ రోహిత్ శర్మ, గంగూలీ, మరి కొంతమందితో పాటు పాక్ కెప్టెన్ బాబార్ అజం సైతం తన మద్దతు తెలిపాడు. తాజాగా ఆ జాబితాలోకి దినేష్ కార్తీక్ చేరాడు. తాజాగా ఓ మీడియాతో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. 'కోహ్లీ తన కెరీర్లో అద్భుతమైన విజయాలను అందుకున్నాడని చెప్పాడు. వెస్టిండీస్ టూర్‌లో అతన్ని తీసుకోకపోవడంతో అతనికి మంచి విరామం లభిస్తుందని, మళ్లీ తిరిగి ఆత్మ విశ్వాసం నింపుకుని గత ఫామ్ ని కొనసాగిస్తాడని ఆశిస్తున్నానని తెలిపాడు. ఇంతటి స్థాయి ఆటగాడిని మీరు ఎప్పటికీ తొలగించలేరు.' అని తెలిపాడు. ప్రతీ ఆటగాడి జీవితంలో ఇది సహజమే అన్నాడు. అలాగే జాతీయ జట్టులోకి రావడం అంత సులభం కాదని, దానికి కోసం చాలా కష్ట పడాలని సూచించాడు. ఈక్రమంలో దినేష్ కార్తీక్.. సైతం జట్టులో చోటు కోల్పోయాడు. అతడు ఐపీఎల్లో అద్వితీయంగా ఆడి తిరిగి జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 37ఏళ్ల దినేష్ కార్తీక్ తన పునరాగమనం గురించి మాట్లాడుతూ.. ఇది నిజంగా చాలా కష్టమైన విషయం అయినప్పటికీ, జాతీయ జట్టులో తిరిగి చోటు కోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పాడు. మరి విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన దినేష్ కార్తీక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: KL Rahul: వీడియో: కేఎల్ రాహుల్‌కు బౌలింగ్ చేసిన జులన్ గోస్వామి ఇదీ చదవండి: Ball of the Century: వీడియో: అద్భుతం మరోసారి ఆవిష్కృతం! షేన్ వార్న్ వేసిన ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’కి రీప్లే!