ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియం వేదికగా విండీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్‌ను కూడా విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆశ్చర్యకరంగా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా వచ్చాడు. ఇద్దరూ కలిసి టీమిండియా మంచి స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 24 రన్స్ చేసి అకేల్ హోసేన్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పంత్(14), హార్దిక్ పాండ్యా(1), జడేజా(16) కూడా పెద్దగా రాణించలేదు. అప్పటి వరకు రోహిత్ శర్మ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ.. 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దినేష్ కార్తీక్ మరోసారి తన ఫినిషింగ్ టచ్‌ను రుచిచూపించాడు. రెండు భారీ సిక్సులతో పాటు నాలుగు ఫోర్లతో కేవలం 19 బంతుల్లోనే 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచి థండర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టీమిండియా స్కోర్ 190 పరుగులకు చేరుకుంది. ఐపీఎల్ 2022 నుంచి ఫినిషర్ రోల్‌ను అద్భుతంగా పోషిస్తున్న డీకే ఈ మ్యాచ్‌లోనూ 215.79 స్ట్రైక్‌రేట్‌తో దుమ్ములేపాడు. డీకే ఇన్నింగ్స్‌తో మొమెంటమ్ ఒక్కసారిగా టీమిండియా వైపు మారిపోయింది. 138 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా 190 పరుగుల టార్గెట్ విండీస్ ముందు ఉంచిందంటే అందుకే డీకే ఇన్నింగ్సే ప్రధాన కారణం. ఇక భారీ లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ను టీమిండియా బౌలర్లు కేవలం 122 పరుగులకే కట్టడి చేశాడు. అర్షదీప్ సింగ్, అశ్విన్, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసిన విండీస్ 68 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సంచలన ఇన్నింగ్స్ ఆడిన దినేష్ కార్తీక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరి ఈ మ్యాచ్‌లో డీకే ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Dinesh Karthik was awarded the player of the match for his sensational cameo at the death overs #dineshkarthik #IndianCricketTeam #WestIndies #WIvIND #Cricket pic.twitter.com/skyQozvg0u — Sportskeeda (@Sportskeeda) July 29, 2022 We're witnessing peak Dinesh Karthik in action! That shot at 0:46, what would you call that?#INDvWI #WIvIND #DineshKarthik #T20I #Iyer #Pant #RohitSharma #Hitman #INDvsWIt20 #Dravid #Hoodapic.twitter.com/jKNZbeWoJt — OneCricket (@OneCricketApp) July 29, 2022