కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటింది. పతకాల పట్టికలో నాలుగోస్థానంలో నిలిచింది. తెలుగు తేజం పీవీ సింధు మరోసారి తన సత్తాచాటింది. తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం అందుకుంది. సింధుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధిస్తూ పీవీ సింధు ఎందరికో ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తోంది. పీవీ సింధూని భారతదేశం, తెలుగువాళ్లే కాదు యావత్ క్రీడా ప్రపంచమే ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. నిజానికి డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ద్వారా తెలుగు వాళ్లకు చాలా దగ్గరయ్యాడు. తెలుగు పాటలకు రీల్స్ చేయడం, తెలుగు సినిమా డైలాగులు చెప్పడంతో బాగా దగ్గరయ్యాడు. - 2014 - 2018 - 2022 It's been a journey but today @weareteamIndia's @PVSindhu1 reached her goal.#CommonwealthGames | #B2022 pic.twitter.com/bxpZGx421q — Commonwealth Sport (@thecgf) August 8, 2022 ఎస్‌ఆర్‌హెచ్ జట్టు వద్దనుకున్నా డేవిడ్ వార్నర్ తెలుగు వారి మీద అభిమానాన్ని చంపకోలేదు. ఆ అభిమానంతోనే ఇప్పుడు వార్నర్ పీవీ సింధూని ప్రత్యేకంగా అభినందించాడు. “వెల్ డన్ సింధూ.. అద్భుతమైన విజయం.. పరిపూర్ణం” అంటూ డేవిడ్ వార్నర్ ఇన్ స్టాగ్రామ్ లో పీవీ సింధు ఫొటో షేర్ చేశాడు. అందుకే ఇండియాలో డేవిడ్ వార్నర్ కు అంత క్రేజ్ అని కొందరు. త్వరగా ఇండియా పౌరసత్వం తీసుకోవాలంటూ ఇంకొదరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) ఇంక కామన్వెల్త్ క్రీడల విషయానికి వస్తే.. భారత్ మొత్తం 61 పతకాలతో మెడల్స్ పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. వాటిలో 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా నిలిచాయి. పీవీ సింధుని డేవిడ్ వార్నర్ ప్రశంసించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. It has been a marvelous campaign for #TeamIndia at the Commonwealth Games, 2022. Congratulations to all the medal winners. India is proud of you #CWG22 pic.twitter.com/l1OSgZoK7K — Doordarshan Sports (@ddsportschannel) August 9, 2022 India finish 4th at the Commonwealth Games 2022 with 22 Gold, 16 Silver and 23 Bronze Medals! #CWG2022 #B2022 pic.twitter.com/0Wy4EiRrbH — Sportskeeda (@Sportskeeda) August 8, 2022 ఇదీ చదవండి: ఫామ్.. గీమ్ పక్కన పెడితే.. పాక్‌తో మ్యాచ్ కోహ్లీకి ఎంతో స్పెషల్! ఇదీ చదవండి: నేపాల్ జాతీయ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్