పాపం పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది గాయాలు పాలవ్వడం వల్ల పాక్ జట్టు నుండి తాత్కాలికంగా తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆసియా కప్ 2022లో ఆడే అవకాశం మిస్ అయ్యింది. అయితే దీన్ని అదునుగా చేసుకుని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ తన వక్ర బుద్ధిని చూపించాడు. "మా షాహీన్ అఫ్రిదికి గాయమవ్వడం వల్ల ఈ ఏడాది ఆసియా కప్‌లో ఆడడం లేదు. భారత క్రికెటర్లు బతికిపోయారు" అన్నట్టు ఒక ట్వీట్ చేశాడు. దీంతో మన భారత క్రికెట్ అభిమానులు ఓ రేంజ్‌లో వకార్ యూనిస్‌పై ఫైరవుతున్నారు. లాస్ట్ ఆసియా కప్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ శర్మ బాదిన వీరబాదుడు వీడియోను షేర్ చేస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్‌ను, షాహీన్ అఫ్రిదిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. "షాహీన్ అఫ్రిది లాస్ట్ ఆసియా కప్‌లో ఉన్నాడు. అప్పుడు మాత్రం ఏం ఒరిగింది అతని వల్ల. ఏ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో హిట్‌మేన్ రోహిత్ శర్మ బాదిన వీర బాదుడు అప్పుడే మర్చిపోయారా? ఇప్పుడు షాహీన్ అఫ్రిది ఉన్నా ఇదే సీన్ రిపీట్ అవుతుంది" అంటూ ఒక అభిమాని రోహిత్ శర్మ వీడియోను షేర్ చేశారు. బిగ్ రిలీఫ్ ఫర్ షాహీన్ అఫ్రిది అంటూ మరొక అభిమాని ఆ వీడియోని షేర్ చేశారు. 2018లో భారత్ ఆసియా కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో భారత్ పాకిస్తాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌కి చుక్కలు చూపించింది. ఇండియాకి, పాకిస్తాన్‌కి జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 43.1 ఓవర్లకి అతి కష్టం మీద 162 పరుగులు చేస్తే, మన వాళ్ళు 29 ఓవర్లలోనే 164 పరుగులు చేసి పాకిస్తాన్‌కి చెమటలు పట్టించారు. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. The way Rohit Sharma bashed Shaheen Shah Afridi in last Asia Cup ☠️ was orgasmic, amount of class in those shots pic.twitter.com/cjka6V97Rj — David (@CricketFreakD) August 21, 2022 పాకిస్తాన్ 50 ఓవర్లలో 237 రన్స్ కొడితే, మనోళ్ళు 39.3 ఓవర్లలో 238 రన్స్ చేసి ముగింపు చెప్పేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడం, బంగ్లాదేశ్ ఫైనల్‌కి చేరుకోవడం, భారత్ ఆసియా కప్‌ని గెలుచుకోవడం మనకి తెలిసిందే. అయితే పాక్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో హిట్‌మేన్ సిక్సులు, ఫోర్లతో చుక్కలు చూపించాడు. దీంతో పాక్ ఘోర పరజయాన్ని మూటగట్టుకుంది. గతం మర్చిపోయి వకార్ యూనిస్ ఎలా భారత్‌ను తక్కువ అంచనా వేస్తున్నాడని క్రికెట్ అభిమానులు చురకలు అంటిస్తున్నారు. అఫ్రిది ఉన్నా పాక్‌కు ఒరిగేదేమీ లేదని, ఈసారి కూడా ఆసియా కప్ భారత్‌దేనని భారత క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి షాహీన్ అఫ్రిది ఉంటే మనోళ్ళు భయపడతారా? భయపెడతారా? మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. Big relief for @iShaheenAfridi https://t.co/cirNtSAIsa pic.twitter.com/nAsPCwgn2Z — Vamsi (@Uchiha_Kai45) August 20, 2022 ఇది కూడా చదవండి: India vs Pakistan: పాక్ జట్టులో అతను తప్ప ఇక మగాళ్ళే లేరా?.. తమకు మగతనం లేదని ఒప్పుకున్న పాక్ క్రికెటర్.. ఇది కూడా చదవండి: Virat Kohli vs Babar Azam: ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్? తేల్చేసిన షేన్ వాట్సన్