బెన్ స్టోక్స్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఓ సంచలనం. ప్రస్తుతం బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్ గా న్యూజిలాండ్ జట్టుపై తొలి సిరీస్ నెగ్గిన ఆనందంలో ఉన్నాడు. అయితే అంతా ఇదేదో బెన్ స్టోక్స్ కలిసొచ్చిందనో.. లక్కీగా గెలిచేశాడేమో అనుకోవచ్చు. కానీ, టెస్టు కెప్టెన్ గా ఈ విజయం అందుకోవడానికి బెన్ స్టోక్స్ చాలానే త్యాగాలు చేశాడు. కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా కూడా.. డబ్బుకు ఆశపడకుండా దేశం కోసం నిలబడ్డాడు. అతను చేసిన త్యాగాలు తిరిగి ఫలితాలు ఇవ్వడంతో మైదానంలోనే బెన్ స్టోక్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. అసలు బెన్ స్టోక్స్ చేసిన త్యాగాలు ఏంటి? ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడో చూద్దాం. బెన్ స్టోక్స్ ఒక విధ్వంసకర ప్లేయర్ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అటు బ్యాటుతో ఇటు బాల్ తోనూ మైదానంలో విజృంభించగలడు. టీ20 క్రికెట్ లో బెన్ స్టోక్స్ ఓ స్టార్ ఆల్రౌండర్ అని అందరికీ తెలుసు. టీ20, ఐపీఎల్ కు ఇంతటి క్రేజ్ ఉన్న ఈ తరుణంలో బెన్ స్టోక్స్ వాటికి దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్ బెన్ స్టోక్స్ కు కచ్చితంగా 10 కోట్లకు పైగానే రేటు పలికే అవకాశం ఉంది. ఒక సీజన్ లో ఆడితే కోట్లలో సంపాదించుకోవచ్చు కానీ, వాటన్నంటిని వదులుకున్నాడు. ఈ ఐపీఎల్ 2022 సీజన్లో అయితే ప్లేయర్ గా తన పేరును కూడా నమోదు చేసుకోలేదు. Mumma's Boyyy #BenStokes pic.twitter.com/ChYPLHe59n — IK Sabbir (@SabbirIk) June 15, 2022 టెస్టు క్రికెట్ లో రాణించాలి.. కెప్టెన్ గా వచ్చిన అవకాశాన్ని నిరూపించుకోవాలనే అనుకున్న బెన్ స్టోక్స్ అదే చేసి చూపించాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండు టెస్టుల్లో.. రెండు అర్ధశతకాలు నమోదు చేసిన స్టోక్స్.. మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు. ముఖ్యంగా కెప్టెన్ గా జట్టులో ఉత్సాహం నింపి.. సిరీస్ ని కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ గా తాను తొలి సిరీస్ ని నెగ్గడం వెనుక అతంటి త్యాగం, కృషి దాగున్నాయి కాబట్టే.. సిరీస్ నెగ్గిన తర్వాత ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. గ్యాలరీలో ఉన్న తన తల్లి డెబ్ స్టోక్స్ ని ఆప్యాయంగా హత్తుకున్నాడు. బెన్ స్టోక్స్ కృషి, త్యాగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Ben Stokes has 98 sixes from 81 matches in Test cricket - equals with Gayle. pic.twitter.com/D8O8nk9o9N — Johns. (@CricCrazyJohns) June 14, 2022 Ben Stokes. What a legend.#ENGvNZ pic.twitter.com/X0C2KFuJja — The Cricketer (@TheCricketerMag) June 14, 2022 ఇదీ చదవండి: IPL నుంచి టీమిండియా వరకు రాహుల్ త్రిపాఠి ప్రయాణం..! ఇదీ చదవండి: వైజాగ్ లో పంత్ క్రేజ్.. మైదానంలోకి పరిగెత్తుకొచ్చి కాళ్లు పట్టేసుకున్నాడు!