విరాట్ కోహ్లీ.. పరుగుల యంత్రంగా పేరు గాంచిన కింగ్ కోహ్లీ కొన్నాళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతుండటం చూశాం. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీ తిరిగి ఫామ్ అందుకుంటాడని అంతా ఆశించారు. ఒకప్పుడు అవలీలగా సెంచరీలు బాదిన కోహ్లీకి.. ఇప్పుడు అర్ధ శతకం నమోదు చేయడం కూడా గగనంగా మారింది. కోహ్లీ శతకం కోసం 71 ఇన్నింగ్స్ నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ దిగ్గజాలు సైతం కోహ్లీ విషయంలో ఘాటుగా స్పందించారు. ఇటీవల కపిల్ దేవ్ విరాట్ కోహ్లీని టీ20ల నుంచి తప్పించవచ్చు కదా అంటూ బీసీసీఐకి సూచించాడు. సెహ్వాగ్ సైతం విరాట్ విషయంలో కాస్త భిన్నంగానే స్పందించాడు. తాజాగా ఆశిష్ నెహ్రా సైతం విరాట్ కోహ్లీ కాస్త విశ్రాంతి తీసుకుంటేనే తిరిగి పుంజుకోగలడు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. "If Kohli isn't performing now, it's fine [to leave him]. Youngsters are playing well. If you can keep Ashwin out, you can keep anyone out" Kapil Dev with some strong words ahead of the second #ENGvIND T20I https://t.co/K3A9WRvunx pic.twitter.com/EN6pGoC0cO — ESPNcricinfo (@ESPNcricinfo) July 9, 2022 ఇలాంటి విమర్శల నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీకి మద్దతు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. విమర్శలు చేసే వారికి రోహిత్ కాస్త గట్టిగానే సమాధానం చెప్పాడు. బయట నుంచి వచ్చే మాటలను తాము పట్టించుకోమని రోహిత్ తేల్చి చెప్పాడు. నిపుణుల పేరుతో వారు చేసే వ్యాఖ్యలను తాము పరిగణలోకి తీసుకోమంటూ ఘాటుగా స్పందించాడు. రెండో వన్డే తర్వాత కూడా రోహిత్ కోహ్లీకి మద్దతుగానే నిలిచాడు. Rohit Sharma takes a dig at experts (Kapil Dev) for questioning Virat Kohli's place in the T20 side during his post-match conference after 3rd T20I against England Watch extended PC on OneCricket Youtube: https://t.co/yC8LCbcq7Z#RohitSharma #ViratKohli #TeamIndia #ENGvIND pic.twitter.com/1NJRo0RmZ5 — OneCricket (@OneCricketApp) July 10, 2022 సొంతవారు ఇలా భిన్నంగా స్పందిస్తుంటే.. పొరుగు దేశాల కెప్టెన్లు మాత్రం విరాట్ కోహ్లీ పూర్తి మద్దతు తెలుపుతున్నారు. పాక్ కెప్టెన్ బాబర్ అజాం కింగ్ కోహ్లీకి మద్దతిస్తూ ట్వీట్ చేశాడు. కోహ్లీతో కలిసున్న ఫొటో తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఇలాంటి పరిస్థితులు వస్తూ పోతూ ఉంటాయి.. ఆత్మవిశ్వాసంతో ఉండాలంటూ తెలిపాడు. తాజాగా ఈ జాబితాలోకి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చేరాడు. This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt — Babar Azam (@babarazam258) July 14, 2022 రెండో వన్డే తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో జోస్ బట్లర్ కు కోహ్లీ గురించి ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానమిస్తూ.. “కోహ్లీ కూడా మానవమాత్రడే కదా. విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ లో ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్లలో ఒకడు. అతను ఇండియాకి ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. అతని ఫామ్ మీద అసలు అనుమానాలు ఎందుకు? ఒకటి, రెండు మ్యాచ్లు ఆడకపోతే అతని టార్గెట్ చేయడం తగదు.” అంటూ జోస్ బట్లర్ అభిప్రాయ పడ్డాడు. టీమిండియా, ఫ్యాన్స్ నుంచి కూడా విరాట్ కోహ్లీకి ఎంతో మద్దతు లభిస్తోంది. అందరూ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావాలనే ఆకాంక్షిస్తున్నారు. వెస్టిండీస్ టూర్ నుంచి విరాట్ కోహ్లీ విశ్రాంతి కోరిన విషయం తెలిసిందే. ఈ టూర్ తర్వాత కోహ్లీ కచ్చితంగా కం బ్యాక్ చేస్తాడంటూ అందరూ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి ఇతర దేశాల కెప్టెన్లు మద్దతుగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Here's what @josbuttler said on @imVkohli.#ENGvsIND #KingKohli pic.twitter.com/EQoGcv8G16 — RevSportz (@RevSportz) July 15, 2022 ఇదీ చదవండి: వీడియో: పాపం ఇషాన్ కిషన్.. కామెడీ కాస్త సీరియస్ అయింది.. ఇదీ చదవండి: లార్డ్స్ లో 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన చాహల్!