వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి.. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో హోప్ (115), కెప్టెన్ పూరన్(74) పరుగులతో రాణించారు. ఇక భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్(63), సంజూ శాంసన్(54), అక్షర్ పటేల్(64) పరుగులతో రాణించారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ సంచనల ఇన్నింగ్స్‌తో చివరి వరకు క్రీజ్‌లో ఉండి టీమిండియాకు సిరీస్ విజయాన్ని అందించాడు. కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్టైల్లో మ్యాచ్‌ను సిక్స్‌తో ముగించి.. చివరికి ధోని పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. నంబర్ 7 లేదా తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అత్యధిక సిక్సులు కొట్టి ఛేజింగ్ మ్యాచ్‌ను గెలిపించిన ఆటగాడిగా అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు. అక్షర్ కంటే ముందు ధోని, యూసుఫ్ పఠాన్ 4 సిక్సులతో ఈ రికార్డును సమిష్టింగా కలిగి ఉన్నారు. ఆదివారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 5 సిక్సులు కొట్టి ధోని, యూసుఫ్ రికార్డును బద్దలుకొట్టాడు. 2005లో జిబాంబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ధోని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 3 సిక్సులు కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఈ రికార్డును 2011లో యూసుఫ్ రెండు సార్లు సమం చేశాడు. కానీ.. రికార్డును దాటలేకపోయాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ధోని రికార్డు బ్రేక్ అయింది. ఈ సందర్భంగా అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ‘సిరీస్ విజయంలో కీలకమైన మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చడం సంతోషంగా ఉంది. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్ ఆడుతున్నాను. ఇకపై ఇదే ఫామ్‌ను జట్టుకు కొనసాగిస్తాను..’ అని అక్షర్ అన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Here's the match-winning knock from @akshar2026. His magical batting earned him the Player of the Match title. Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode https://t.co/RCdQk1l7GU@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/y8xQeUxtK6 — FanCode (@FanCode) July 24, 2022