Asia Cup 2022: యూఏఈ వేదికగా జరుగుతోన్న ఆసియాకప్ 2022 టోర్నీలో టీమిండియా అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. తొలి పోరులో పాకిస్తాన్ పై విజయం సాధించిన భారత జట్టు, హాంగ్ కాంగ్ పై కూడా గెలిచి సూపర్ 4కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం పాక్ జట్టుతో మరోసారి తలపడనుంది. ఈ సమరం కోసం టీమిండియా క్రికెటర్లు గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక.. మాజీ సారధి విరాట్ కోహ్లీ అందరి కంటే భిన్నంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. హై ఆల్టిట్యూడ్ మాస్క్‌ను ధరించి మరీ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. అసలు.. కోహ్లీ ఈ మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యూఏఈ వాతావరణంలో ఇమడిలేక ఆటగాళ్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. వేడి, తేమ పరిస్థితులు అధికంగా ఉండడంతో తరుచూ గాయపడుతున్నారు. ఈ కారణంగానే పాకిస్థాన్ ఆటగాడు నసీం షా.. భారత్ తో మ్యాచ్ లో కండరాలు పట్టేసి తెగ ఇబ్బందిపడ్డాడు. అందుకే ముందు జాగ్రత్తగా కోహ్లీ హై ఆల్టిట్యూడ్ మాస్కు ధరించి ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా క్రికెటర్లెవరూ హై-ఆల్టిట్యూడ్ మాస్క్‌ను వినియోగించరు. అథ్లెట్స్ ఉపయోగిస్తుంటారు. ఈ మాస్క్ ఆటగాళ్ల శ్వాస కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా ఊపరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏదేమైనా.. కోహ్లీ ఇలా మాస్క్ ధరించి ప్రాక్టీస్ చేయడం.. అతనికి క్రికెట్ పట్ల ఉన్న డెడికేషన్ ను చూపిస్తోంది. @imVkohli Wearing A Mask During the Practice Session Before The Sunday's Match : @xtratimeindia #ViratKohli #AsiaCup pic.twitter.com/CfQZsr1E89 — virat_kohli_18_club (@KohliSensation) September 2, 2022 ఇటీవల పెద్దగా ఫామ్‌లో లేని కోహ్లీ.. తాజాగా జరుగుతున్న ఆసియా కప్‌లో మాత్రం పర్వాలేదనిపిస్తున్నాడు. ఆడిన రెండు మ్యాచుల్లో 94 రన్స్ చేశాడు. పాకిస్థాన్‌పై 35 పరుగులు చేయగా, హాంగ్‌కాంగ్ మ్యాచులో 59 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ పరంగా గొప్పగా లేనప్పటకీ.. విలువైన పరుగులని చెప్పొచ్చు. భారత్‌తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక జట్లు సూపర్ 4కు అర్హత సాధించాయి. రెండో రౌండ్‌లో ఈ నాలుగు జట్లు కూడా మూడేసి చొప్పున మ్యాచ్‌లను ఆడతాయి. టీమిండియా తొలుత పాకిస్తాన్, అనంతరం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లను ఎదుర్కొంటుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆదివారం జరగాల్సి ఉండగా, 6న శ్రీలంక, 8న ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టనుంది. హై ఆల్టిట్యూడ్ మాస్క్ ధరించి మరీ.. కోహ్లీ ప్రాక్టీస్ చేయడంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: చిరిగిన షూకు గమ్ పెట్టి ఆడి.. ఆసీస్‌ను వణికించాడు! ఎవరీ ర్యాన్ బర్ల్? ఇదీ చదవండి: AUS vs ZIM: చరిత్ర సృష్టించిన జింబాబ్వే! సొంతగడ్డపైనే ఆస్ట్రేలియా చిత్తు