ఇండియా తర్వాత క్రికెట్‌ను అమితంగా ప్రేమించే దేశాల్లో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ ముందు వరుసలో ఉంటాయి. టీమిండియా గెలుపోటములకు మనమెంత భావోద్వేగానికి గురవుతామో వాళ్లు అంతే. కానీ.. ఈ సారి క్రికెట్‌పై అభిమానం హద్దులు దాటింది. మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కుర్చీలను విసురుకుంటూ.. దొరికిన దొరికినట్టు చావబాది రణరంగం సృష్టించారు. ఈ ఘటన ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ ఫోర్‌లో బుధవారం పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. ఆసియా కప్ ఫైనల్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ అంచనాలకు మించి రాణించింది. ప్రత్యర్థి పాక్‌ను చివరి ఓవర్ వరకు వణికించింది. కానీ.. అనూహ్యంగా చివరి ఓవర్‌లో రెండు సిక్సులు సమర్పించుకుని ఊహించని ఓటమిని చవిచూసింది. అప్పటి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ ఓడిపోవడంతో అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో పాక్ అభిమానులు అతి సంబరాలు వారికి కోపం తెప్పించాయి. అంతే.. ఇరుదేశాల అభిమానులు స్టేడియంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు. స్టాండ్స్‌లోని కుర్చీలను ఎత్తేసుకుంటూ.. రణరంగం సృష్టించారు. ఈ ఘటనపై మాజీ క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది. ఇబ్రహీం జద్రాన్ 35 పరుగులతో రాణించాడు. చివర్లో రషీద్ ఖాన్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో పర్వాలేదనిపించాడు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కేవలం 129 పరుగులు మాత్రమే చేసిన ఆఫ్ఘాన్ ఈ మ్యాచ్‌లో ఇక గెలవడం అసాధ్యం అనిపించింది. కానీ.. బౌలింగ్‌లో తమ సత్తా చాటుతూ.. పాకిస్థాన్‌కు వణుకు పుట్టించారు. చివరి ఓవర్లలో పాక్‌కు ఓటమి భయం రుచిచూపించారు. తొలి ఓవర్‌లోనే పాక్ కెప్టెన్‌ను ఫారూఖీ అవుట్ చేసి పాక్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు రన్స్ ఇవ్వకుండా పాక్‌ను ఇబ్బంది పెట్టారు. చివరి ఐదు ఓవర్లు అయితే పాకిస్థాన్ ఓడిపోతుందేమో అనిపించింది. చివర్లో కేవలం 21 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ గెలిచినంత పనిచేశారు. చివరి ఓవర్ వచ్చేసరికి పాకిస్థాన్‌కు 11 పరుగులు కావాలి. కానీ.. అఫ్ఘనిస్థాన్‌కు ఒక్కటే వికెట్‌కావాలి. క్రీజ్‌లో ఉంది బ్యాట్ సరిగ్గా పట్టడం కూడా రాని టెయిలెండర్లు.. ఇంకేముందు అఫ్ఘనిస్థాన్ విజయం ఖాయంగా కనిపించింది. 18వ ఓవర్‌ను అద్భుతంగా వేసిన ఫారుఖీ చేతిలో బంతి.. స్ట్రైక్‌లో పాక్ యువ పేసర్ నసీమ్ షా ఉన్నాడు. తొలి బంతిని యార్కర్ కోసం ప్రయత్నించి ఫారూఖీ ఫుల్ టాస్ వేస్తాడు. దాన్ని నసీమ్ సిక్స్‌గా మలచి షాక్ ఇస్తాడు. అయినా పర్వాలేదు. ఇంకా 5 రన్స్ ఉన్నాయి డిఫెండ్ చేసుకోడానికి ఒక్క వికెట్ చాలు అనుకున్నారు ఆఫ్ఘాన్ ఆటగాళ్లు.. కానీ.. ఫారూఖీ మళ్లీ అదే తప్పు చేస్తూ.. మరో ఫుల్ టాస్.. సేమ్ రిజల్ట్. తొలి రెండు బంతులను సిక్స్‌లు కొట్టి.. ఓడిపోతుందనుకున్న పాక్‌ను గెలిపించాడు నసీమ్ షా. దీంతో పాక్ ఆటగాళ్లు ఫైనల్ గెలిచినంత సంబరపడ్డారు. అంతవరకు అద్భుత పోరాట పటిమ చూపిన ఆఫ్ఘాన్ ఆటగాళ్లు.. చివరి ఓవర్‌లో ఒత్తిడికి చిత్తై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. దీని తర్వాత స్టేడియంలో ఫ్యాన్ వార్ మొదలైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: అప్పటి క్రికెటర్స్‌లో ఉన్న పోరాట పటిమ, కసి ఇప్పటి కుర్రాళ్లలో ఎందుకు లేదు? This is just so disappointing to see. pic.twitter.com/qif9dNM3Qx — Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2022 This is what Afghan fans are doing. This is what they've done in the past multiple times.This is a game and its supposed to be played and taken in the right spirit.@ShafiqStanikzai your crowd & your players both need to learn a few things if you guys want to grow in the sport. pic.twitter.com/rg57D0c7t8 — Shoaib Akhtar (@shoaib100mph) September 7, 2022