టైటిల్ హాట్ ఫేవరేట్‌గా ఆసియా కప్ బరిలోకి దిగిన టీమిండియా.. అందుకు తగ్గట్లు గ్రూప్ స్టేజ్‌లో రెండు వరుస విజయాలతో అదరగొట్టింది. గ్రూప్ ఏ నుంచి పాక్, హాంకాంగ్‌ను మట్టికరిపించి.. సూపర్ ఫోర్‌కు చేరిన టీమిండియా దారుణ ప్రదర్శనను కనబరుస్తోంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలా అయితే మిడిల్డార్ వైఫల్యం, ఫేలవ బౌలింగ్‌తో ఓడిందో.. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ అవే తప్పిదాలతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో టీమిండియాకు ఆసియా కప్ ఫైనల్ అవకాశాలు దాదాపు దూరమైనట్లే. పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు ఓడి, టీమిండియా అఫ్ఘనిస్థాన్‌పై భారీ తేడాతో గెలిస్తే గానీ.. భారత్‌కు ఫైనల్ చేరే ఛాన్స్ లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితి వస్తుందనే అవగాహన ఉన్నా.. శ్రీలంకతో ఆడబోయేది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అని తెలిసినా కూడా టీమిండియా కొన్ని తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. టాస్ ఓడిపోవడం ఒక దురదృష్టమైతే.. చేజేతులా ఆటగాళ్లు చేసిన తప్పులు కూడా శ్రీలంకపై ఓటమికి కారణంగా చెప్పవచ్చు. ఆ ఒక్క రనౌట్‌తో మ్యాచ్ మనదే అయ్యేది.. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి శ్రీలంకకు 174 పరుగుల టార్గెట్ ఇచ్చింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. టీమిండియా లాంటి పెద్ద టీమ్‌పై 174 పరుగుల టార్గెట్ చేజ్ చేయడం అంత ఈజీ కాదనే ప్రెషర్ శ్రీలంక బ్యాటర్లలో కనిపించింది. ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి రెండు ఓవర్లలోనే ఆ విషయం స్పష్టంగా అర్థమైంది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం ఒకే ఒక రన్ ఇచ్చాడు. అలాగే రెండో ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ తొలి ఐదు బంతుల్లో కేవలం 4 పరుగులే ఇచ్చి శ్రీలంక ఓపెనర్లపై మరింత ప్రెషర్ పెంచాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పరుగులు రాకపోవడంతో.. శ్రీలంక ఓపెనర్లు ఒత్తిడికి గురయ్యారు. రెండో ఓవర్ ఐదో బంతిని మిడ్‌ఆన్ వైపు ఆడిన కుషల్ మెండిస్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. కానీ బంతి నేరుగా కేఎల్ రాహుల్ చేతుల్లోకి వెళ్లింది. అయినా కూడా మెండిస్ రన్ కోసం రిస్క్ చేశాడు. వెంటనే బంతిని అందుకున్న రాహుల్ మెరుపువేగంతో బౌలర్ ఎండ్ వికెట్లకు త్రో విసిరాడు. కానీ.. ఆ త్రో మిస్ ఫైర్ అయింది. పరుగులు రావడంలేదనే ఒత్తిడిలో లేని పరుగు కోసం ప్రయత్నించిన మెండిస్ రనౌట్ ప్రమాదం నుంచి బతికిపోయాడు. ఇక ఇక్కడి నుంచి శ్రీలంక ఓపెనర్లు టీమిండియాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. పవర్ ప్లేలో రెండు ఓవర్లు ఆడి డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేని లంక ఓపెనర్లు మెండిస్, నిస్సంకా.. కేఎల్ రాహుల్ ఇచ్చిన లైఫ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. కేఎల్ రాహుల్ కనుక ఆ త్రోను ఫర్ఫెక్ట్‌గా కొట్టి ఉంటే కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేంది. అప్పటికే పరుగులు రాని ఒత్తిడిలో ఉన్న శ్రీలంక రెండో ఓవర్‌లోనే ఫామ్‌లో ఉన్న మెండిస్ వికెట్ కోల్పోయి ఉంటే.. కచ్చితంగా ఆత్మరక్షణలో పడేది. దీంతో పవర్‌ప్లేలో శ్రీలంక బ్యాటర్లు టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగేవారు కాదు. రాహుల్ ఇచ్చిన లైఫ్‌ను పూర్తిగా ఉపయోగించుకున్న మెండిస్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతనితో పాటు మరో ఓపెనర్ నిస్సంకా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్‌ను శ్రీలంక వైపు లాగేసుకున్నారు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో కానీ.. టీమిండియాకు తొలి వికెట్ లభించలేదు. ఇదే వికెట్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే దొరికి ఉంటే టీమిండియా మరింత పట్టుబిగించేంది. ఓపెనర్లు ఇద్దరూ అవుటైన తర్వాత యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టి.. వికెట్లు తీసి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. కానీ.. 19వ ఓవర్‌ను భువనేశ్వర్ కుమార్‌కు ఇచ్చి పాక్‌తో మ్యాచ్‌లో చేసిన తప్పే మళ్లీ చేశాడు రోహిత్ శర్మ. 12 బంతుల్లో 21 రన్స్ డిఫెండ్ చేయాల్సిన సమయంలో 19వ ఓవర్ వేసిన భువీ ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో శ్రీలంక విజయం లాంఛనమైంది. కానీ చివరి ఓవర్‌లో కేవలం 7 పరుగులను సైతం డిఫెండ్ చేసేందుకు టీమిండియా యువ బౌలర్ అర్షదీప్ శాయశక్తుల కృషి చేశాడు. తొలి రెండు బంతులకు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడో బంతికి భానుక రాజపక్సా రెండు పరుగులు తీశాడు. నాలుగో బంతికి మళ్లీ సింగిల్ మాత్రమే ఇచ్చి అర్షదీప్ శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టాడు. ఇదే అదునుగా ఐదో బాల్‌ను సైతం అద్భుతంగా వేయడంతో బ్యాటర్ దాన్ని మిస్ అయ్యాడు. బంతి కీపర్ చేతుల్లోకి వెళ్తుండగా.. రాజపక్సా పరుగు కోసం వెళ్లాడు. కానీ.. పంత్ వికెట్లకు త్రో వేయడంలో విఫలం అయ్యాడు. ఆ బంతి బౌలర్ అర్షదీప్ చేతుల్లో పడింది. అతను నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు త్రో కొడితే అది కూడా మిస్ అయింది. ఓవర్ త్రోతో మరో సింగిల్ వచ్చింది. పంత్ తప్పిదంతో డాట్ బాల్‌కు అనవసరంగా రెండు పరుగులు రావడంతో శ్రీలంక 174 టార్గెట్‌కు రీచ్ అయింది. కానీ.. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభంలో కేఎల్ రాహుల్ సరిగ్గా త్రో కొట్టి ఉంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచేది. ఆ ఒక్క మిస్ త్రో టీమిండియాకు మ్యాచ్‌తో పాటు ఆసియా కప్‌ను దూరం చేసిందని చెప్పవచ్చు. మరి కేఎల్ రాహుల్ మిస్ త్రోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ద్రవిడ్ సర్ అతి ప్రయోగాలే టీమిండియా కొంపముంచాయా?