పసికూన జట్లయినా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్ల చేతిలో చిత్తయినా చింతలేదు. కానీ, పొరుగు దేశం పాకిస్థాన్ చేతిలో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేం! గెలిస్తే.. ప్రపంచ కప్ గెలిచినంతగా సంబురపడతాం. అదే.. ఓడితే 100 కోట్ల భారతీయుల హృదయాలు మూగబోతాయి. అప్పటివరకు హీరోలుగా ఉన్న మన క్రికెటర్లు.. జీరోలు అవుతారు. వారం గడిస్తే కానీ, మ్యాచ్ ఫలితాన్ని మరిచిపోలేం. అలాంటి హై వోల్టేజ్ సమరానికి సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో(ఆగస్టు 28) ఈ ఉత్కంఠ పోరుకు తెరలేవనుంది. ఈ తరుణంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ పై నోరువిప్పాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో ముచ్చటించిన హిట్ మ్యాన్.. భారత్, పాకిస్తాన్ అంటే, ఒత్తిడి ఉండడం సహజం. అలాగని.. ఈ మ్యాచ్‌కు ఉన్న హైప్‌ను చూసి బెదిరిపోవద్దని యువ ఆటగాళ్లకు సూచించినట్లు తెలిపాడు. అఫ్గానిస్థాన్ ఎలాగో పాకిస్థాన్‌తో మ్యాచ్ కూడా అంతేనని, అందుకోసం కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. "ఈ మ్యాచ్‌ను ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. అందులోనూ, తమ జట్టే గెలవాలని అభిమానులు కోరుకోవడం సహజం. భారత్, పాకిస్తాన్ అంటే, ఒత్తిడి ఉంటుంది. కానీ, జట్టులో సాధారణ పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. మేము.. ఈ మ్యాచ్‌ను ఎక్కువ హైప్ చేయాలనుకోవడం లేదు. పాకిస్థాన్‌తో ఇప్పటి వరకు ఆడని ఆటగాళ్లు, ఒకటి, రెండు సార్లు మాత్రమే ఆడిన ప్లేయర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. 'ఇతర ప్రత్యర్థుల్లానే పాకిస్థాన్ కూడా ఓ జట్టు.. అన్న మైండ్‌సెట్ తోనే ఉండాలి' అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. Hello DUBAI Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia pic.twitter.com/bVo2TWa1sz — BCCI (@BCCI) August 24, 2022 కాగా, 1984 నుంచి ఇప్పటి వరకు ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌లు 14 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 8 సార్లు గెలుపొందగా, పాకిస్థాన్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 1997లో వర్షం కారణంగా ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఇప్పుడు, మరోసారి హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు.. పాకిస్తాన్ కూడా పేపర్ పై బలంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్..ఇలా అన్నింటిలోనూ సమతూకంగా కనిపిస్తోంది. భారత జట్టుదే విజయమని కొందరు భావిస్తుంటే.. మరికొందరేమో, యూఏఈలో టోర్నీ జరుగుతున్నందున పాకిస్థాన్ జట్టే ఫేవరెట్ అని చెప్తున్నారు. ఏదేమైనా అభిమానులకు ఈ మ్యాచ్ మంచి ఎంటర్టైన్ మెంట్ అని చెప్పాలి. ఇండియా, పాక్ పోరులో విజయం ఎవరిదో? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Captain Rohit sharma hitting the bowlers in nets. pic.twitter.com/D5Kaou4Z17 — Johns. (@CricCrazyJ0hns) August 25, 2022 ఇదీ చదవండి: India vs Pakistan in Asia Cup: ఆసియా కప్ టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచుల లెక్కలు ఇవే! ఇదీ చదవండి: Asia Cup 2022 Prediction: ఆ మ్యాచ్ గెలిచిన జట్టుదే ‘ఆసియా కప్’ ట్రోఫీ: షేన్ వాట్సన్