క్రీడా ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి అందరికి తెలిసిందే. అందులోనా భారత్ - పాక్ మ్యాచ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాయాదుల మ్యాచ్ అంటే ఆఫీసులు ఎగ్గొట్టి టీవీలకు అతుక్కుంటారు క్రికెట్ ప్రేమికులు. మరి అలాంటి సంగ్రామమే ఆగస్టు 28 న జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎప్పటిలాగే క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. హాట్ కేకుల్లా భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు అమ్ముడయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆసియా కప్ - 2022లో భాగంగా భారత్ - పాక్ మ్యాచ్ ఆగస్టు 28 న జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ఆగస్టు 15న ప్రారంభించగా హాట్ కేకల్లా క్షణాల్లో అమ్ముడైయ్యాయి. ఈ టికెట్ల అమ్మకాన్ని ప్లాటినంలిస్ట్ అనే వెబ్ సైట్ నిర్వాహకులు అప్పగించారు. ఇక టికెట్ల అమ్మకం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే లక్షల టికెట్లు అమ్ముడైయ్యాయి. ఇక రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సైట్ లోకి ఒకే సారి 7.5 లక్షల మంది లాగిన్ అవ్వడంతో కాసేపు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్ ఆపేందుకు నిర్వహకులు ఆన్ లైన్ క్యూ పద్ధతిని పాటించారు. దీంతో కొంత మందికి టికెట్ల విషయంలో నిరాశే ఎదురైంది. కొంత మంది అభిమానులు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పై విమర్శలు గుప్పించారు. కౌన్సిల్ సరైన నిబంధనలు పాటించలేదని, టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ దాయదుల పోరు అంటే తగ్గేదే లే అంటూ టికెట్ల అమ్మకాలు జరిగాయి. మరి ఈ విధంగా టికెట్ల అమ్మకాలు జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. All other matches remain on sale, so please stay in the queue to buy tickets. Follow us to know when the next batch of tickets goes on sale! Please note: there are very few remaining tickets for the Hospitality category, price from AED2500. pic.twitter.com/hyVH0JibfI — Platinumlist (@Platinumlist) August 15, 2022 Get ready! #AsiaCup2022 The tickets for the much-awaited Asia Cup 2022 Dubai and Sharjah matches will go on sale tonight, 15th August, at 6PM. (1/2) pic.twitter.com/eGO1qmTDUi — Platinumlist (@Platinumlist) August 15, 2022 ఇదీ చదవండి: వీడియో: త్రో బౌలింగ్ వేశాడు! పాక్ బౌలర్ యాక్షన్‌పై స్టోయినీస్.. ఇదీ చదవండి: భారత్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను రద్దు చేసిన ఫిఫా! కారణమేంటంటే..