ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ చిత్తుచిత్తుగా ఓడింది. తొలుత బౌలింగ్‌లో 15వ ఓవర్ వరకు పర్వాలేదనిపించిన హాంకాంగ్ తర్వాత తేలిపోయింది. చివరి 5 ఓవర్లలో ధారళంగా పరుగులు సమర్పించుకుంది. ఇక బ్యాటింగ్‌లో అయితే మరీ దారుణంగా 38 పరుగులకే కుప్పకూలింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్ చేరారు. కెప్టెన్ నిజాఖత్ ఖాన్ (2), ముర్తాజా (2), బాబర్ హయత్ (0), కించిత్ షా (6), ఐజాజ్ ఖాన్ (1), స్కాట్ (4), జీషన్ అలీ (3), హరూన్ అర్షద్ (3), అయుష్ శుక్లా (1), మహమ్మద్ గజన్ ఫర్ (0), ఎసాన్ ఖాన్ (1నాటౌట్) సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యారు. ఒక్కరు కూడా 10 పరుగులకు మించి స్కోరు చేయలేదు. 82061433010 ఇది చూసేందుకు ఫోన్ నంబర్లా ఉన్నా.. అవి 11 మంది హాంకాంగ్ బ్యాటర్లు చేసిన పరుగులు. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న హాంకాంగ్ పాక్‌తో మ్యాచ్‌లో మాత్రం పసికూన పేరును సార్థకం చేసుకుంది. హాంకాంగ్ బౌలింగ్‌ను ఇండియా, పాకిస్థాన్ ఒకే విధంగా ఎదుర్కొన్నాయి. రెండు జట్లు తొలి 15 ఓవర్ల పాటు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాయి. ఆ తర్వాత బ్యాటర్లు ఎదురుదాడికి దిగితే హాంకాంగ్ బౌలర్లు ఒత్తిడిలోకి వచ్చి భారీగా పరుగులు ఇచ్చేశారు. హాంకాంగ్‌పై టీమిండియా 192 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోతే.. పాకిస్థాన్ కూడా 193 పరుగులు చేసి 2 వికెట్లే కోల్పోయింది. బ్యాటింగ్‌లో రెండు జట్లు హాంకాంగ్‌పై ఒకే విధమైన స్ట్రాటజీ అవలంభించి ఒకేలా స్కోర్లు సాధించాయి. కానీ.. బౌలింగ్‌లో మాత్రం పాకిస్థాన్ హాంకాంగ్‌ను చావు దెబ్బకొడితే.. టీమిండియా బౌలర్లు మాత్రం అంత ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే ఫలితం వేరేలా ఉండేది. ఎందుకంటే హాంకాంగ్ టీమిండియా బౌలర్లను ఎదుర్కొని కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు సాధించారు. ఈ విషయంపైనే పాక్-హాంకాంగ్ మ్యాచ్ తర్వాత టీమిండియా బౌలర్లపై విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ బౌలర్లు కుప్పకూల్చినట్లు హాంకాంగ్‌ను టీమిండియా బౌలర్లు ఎందుకు నియంత్రించలేకపోయారంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇది టీమిండియా బౌలింగ్ దళం బలహీనతను తేటతెల్లం చేస్తుందని అంటున్నారు. నిజానికి హాంకాంగ్ మనపై మంచి బ్యాటింగ్ చేసిందని అనుకున్నా.. టీమిండియా బౌలర్లు 152 పరుగులు ఇచ్చినా.. కనీసం వారిని ఆలౌట్ చేసినా బాగుండేది. ముఖ్యంగా ఆవేశ్ ఖాన్ తన 4 ఓవర్ల కోటాలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న అర్షదీప్ సింగ్ సైతం 40పైనే పరుగులు ఇచ్చుకున్నాడు. హాంకాంగ్పైనే టీమిండియా బౌలర్లు ప్రభావం చూపలేకపోతే రాబోయే మ్యాచ్‌ల్లో పరిస్థితి ఏంటిని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చాలా రోజుల తర్వాత భారత్‌తో మ్యాచ్ అనగానే పాక్ ఆటగాళ్లు ఒత్తిడికి గురై.. తొలి మ్యాచ్‌లో ఓడినా.. వెంటనే మరో భారత్‌తో మరో మ్యాచ్ అనగానే వారిలో అంత ఒత్తిడి ఉండకపోవచ్చు. అప్పుడు వారు టీమిండియా బౌలర్లను సులువుగా ఎదుర్కొని భారీగా పరుగులు చేసే అవకాశం ఉంది. సూపర్ ఫోర్లో టీమిండియా పాక్, అఫ్ఘనిస్థాన్, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. వీటిలో శ్రీలంక అంతగా పోటీ ఇవ్వకపోయినా.. పాక్, అఫ్ఘనిస్థాన్ నుంచి టీమిండియా గట్టి పోటీ ఎదురువ్వడం ఖాయం. మరి ఇలాంటి బౌలింగ్‌తో వారిని సూపర్ ఫోర్లో ఎలా ఎదుర్కొంటారో అని భారత క్రికెట్ అభిమానులు, క్రికెట్ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్‌లో టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తున్నా.. బౌలింగ్‌లో మాత్రం భువనేశ్వర్ కుమార్, చాహల్ తప్ప మిగతా వాళ్లు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా జట్టుకు దూరమయ్యాడు. అతనిస్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ వెంటనే యూఏఈ పిచ్‌లకు అలవాటు పడటం కష్టం ఈ నేపథ్యంలో హార్ధిక్ పాండ్యా పై టీమిండియా ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాను కుప్పకూల్చిన జింబాబ్వే! వాళ్లంటే ఆసీస్‌కు ఇంకా భయం పోలేదా? Hk vs avesh khan: 53-1 (4) Hk vs entire pak team: 38-10 (10.4) • whenn you realize india team conceded 150+ vs this same opposition a day ago pic.twitter.com/Z1kVFaC8CO — M S C (@_friendlycheema) September 2, 2022 Still can't find out that, How this team managed to make 152-5 against our bowlers#PAKvsHK #PAKvHKG pic.twitter.com/3MPTOFVmG2 — BumbleBee 軸 (@itzMK_02) September 2, 2022 Pakistan vs Hong Kong (Today) HK- 38/10 (10.4) Pak won by 155 runs India vs Hong Kong ( Wednesday ) HK- 152/5 (20) Ind won by 40 runs https://t.co/Xyuubm7Vjs — Raief رائف (@er_ryf) September 2, 2022 వీడియో: అసలు బెండపూడి పాఠశాలలో ఏం జరుగుతోంది?