యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్రికెట్ సాకర్ సంగ్రామం, అదేనండి.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వచ్చేసింది. ఆసియా కప్‌లో భాగంగా రేపు(ఆదివారం, ఆగస్ట్ 28) దాయాదుల పోరు జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. టిక్కెట్లన్ని హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ మెగా మ్యాచ్‌కు యూఏఈ కూడా ముస్తాబైంది. కానీ.. ఏదో తెలియని వెలితి ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అదో మినీ యుద్ధం. తుపాకులు, కత్తులు లేకుండా దేశం మొత్తం తరఫున 11 మంది ఆటగాళ్లు పాల్గొనే సంగ్రామం. పేరుకు క్రికెట్ మ్యాచే అయినా.. అది భావోద్వేగాలతో కూడిన రక్తం చిందని యుద్ధం. ఇరు దేశాల అభిమానులకు మిగతా దేశాలతో మ్యాచ్‌లన్నీ ఒక ఎత్తు.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఒక ఎత్తు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్ ఏదో పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. క్రికెట్ ఫీవర్‌తో ఎక్కడ చూసిన మ్యాచ్‌పైనే చర్చ. అలాగే ఇరు దేశాల ఆటగాళ్లు కూడా మ్యాచ్‌కు కొన్ని నెలల ముందు నుంచే సవాళ్లు, ప్రతి సవాళ్లతో మరింత వేడిని పెంచేస్తుంటారు. కానీ.. ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ఇది మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో భారత్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే చాలు.. పాక్ ఆటగాళ్లు నోరేసుకుని పడిపోయేవారు. టీమిండియా బౌలర్లను చితక్కొడతాం అంటూ బ్యాటర్లు, బ్యాటింగ్‌ను కుప్పకూలుస్తామంటూ బౌలర్లు మ్యాచ్‌కు ముందు వార్నింగ్‌లు పాస్ చేసేవారు. ‘సచిన్‌ను తొలి ఓవర్‌లోనే అవుట్ చేస్తా.. టీమిండియా టాపార్డర్‌ను వణికిస్తా’ అంటూ అప్పట్లో షోయబ్ అక్తర్ హెచ్చరించేవాడు. అలాగే పాక్ మాజీ కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్ కూడా మ్యాచ్‌కు ముందు తీవ్ర వ్యాఖ్యలు చేసేవాడు. ఈ వార్నింగ్‌లకు కొన్నిసార్లు టీమిండియా ఆటగాళ్లు కౌంటర్ ఇచ్చేనా, మరికొన్ని సార్లు మ్యాచ్‌లో ఆటతోనే గట్టి జవాబు చెప్పేవారు. ఒక మ్యాచ్ సందర్భంగా టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూలుస్తానని అక్తర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న సచిన్.. మ్యాచ్ తొలి ఓవర్‌లోనే అక్తర్‌ను పిచ్చికొట్టుడు కొడతాడు. దాంతో అక్తర్‌ను పవర్‌ప్లే బౌలింగ్ ఎటాక్ నుంచి తప్పిస్తారు. ఇలా గతంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎక్కడ లేని హైప్, క్రేజ్ ఉండేది. ఎక్కడ చూసిన మ్యాచ్ గురించే చర్చ. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు కూడా పాక్ కెప్టెన్ బాబర్ అజమ్.. ‘టీమిండియాను చిత్తుగా ఓడించి చరిత్రను తిరగరాస్తాం’ అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశాడు. కానీ.. ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడంలేదు. ఇరు దేశాల ఆటగాళ్లు ఒకరి పట్ల ఒకరు ఎంతో స్నేహభావంతో మెలుగుతున్నారు. సవాళ్లు ప్రతిసవాళ్ల ఊసేలేదు. పైగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాలని, అందుకోసం ప్రార్థనలు కూడా చేస్తున్నట్లు పాక్ ఆటగాళ్లు ప్రకటించి.. కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నారు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్ లాంటి మాజీ క్రికెటర్లు సైతం ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను కేవలం మ్యాచ్‌లానే చూడాలని చెప్పడంతో.. గతంలో ఉండే ఆ ఫైర్ మిస్ అయినట్లు కనిపిస్తుంది. మైదానంలో ప్రత్యర్థుల్లా తలపడినా బయట అన్నదమ్ముల్లా ఉంటామని సెహ్వాగ్ పేర్కొనడంతో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను కూడా మిగతా సాధారణ మ్యాచుల్లా భావించాలని చెబుతున్నట్లు ఉంది. గతంలో ఉండే హైప్, క్రేజ్ వల్ల ఆటగాళ్లపై విపరీతమైన ఒత్తిడి ఉండేది. అలాగే మ్యాచ్‌లో ఓడిన జట్టు ఆటగాళ్ల ఇళ్లపై భౌతిక దాడులు కూడా జరిగేవి. అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసమే అనవసరమైన వ్యాఖ్యలతో భావోద్వేగాలను రెచ్చగొట్టకుండా.. పరస్పరం స్నేహభావంతో మెలుగుతున్నట్లు కనిపిస్తుంది. ప్రాక్టీస్ సమయంలో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం.. యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు.. ఫామ్‌లో లేని ప్రత్యర్థి ఆటగాడు బాగా ఆడి ఫామ్‌లోకి రావాలని కోరుకోవడంతో.. ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో కూడా భావోద్వేగాలను తగ్గించి, మ్యాచ్‌ను స్పోర్టివ్‌గా తీసుకునేలా చైతన్యపరుస్తున్నట్లు ఉన్నారు. నిజానికి ఆటను ఆటలా చూడాల్సిందే. మ్యాచ్‌లో గెలుపోటములు సహజం. అంతే కానీ.. గెలిస్తే నెత్తిన పెట్టుకుని, ఓడితే దూషణకు, ద్వేషానికి, దాడులకు దిగడం సరైంది కాదు. ప్రస్తుతం ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై అభిమానుల్లో తారాస్థాయిలో క్రేజ్ ఉన్నా.. ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య మాత్రం గతంలోలా వైరం మాత్రం లేదని అర్థం అవుతుంది. ఇది ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలకు మంచి చేసేదే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పరామర్శించేందుకు వచ్చిన కోహ్లీ మనసు గెలుచుకున్న షాహీన్ అఫ్రిదీ! Out of context IND vs Pak pic.twitter.com/sKHiSsRzlR — Out Of Context Cricket (@GemsOfCricket) August 26, 2022 ‘We want to see you back in form’ ♥️#AsiaCup #ViratKohli #INDvsPAK pic.twitter.com/gwSBnH4I0Q — Wisden India (@WisdenIndia) August 26, 2022 Missing that old banters and heat moments between players #INDvPAK #Indvspak #AsiaCup2022 #ViratKohli #BabarAzam #CricketTwitter dubai pic.twitter.com/AsKlVh9fRU — Divyansh khanna (@meme_lord2663) August 26, 2022