భారత్, పాకిస్తాన్.. పేరుకు ఈ రెండు దేశాలు దాయాది దేశాలైనా.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విధంగా ఎప్పుడూ పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితులు కేవలం దేశ సరిహద్దుల్లో మాత్రమే కాదు.. దేశ ప్రజల్లోనూ ఉంటాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ఇరుదేశాల ప్రజల దృష్టంతా మ్యాచ్ పైనే ఉంటుంది. ఇలాంటి తరుణంలో యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లు తలపడునున్నాయి. ఈ క్రమంలో జట్టులో ఎవరకి చోటు దక్కుతుంది? ఎవరెవరు ఓపెనింగ్ చేస్తారు? పేస్ బౌలింగ్ బాధ్యతలను ఎవరు నెరవేరుస్తారు? జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. ఈ విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అందరికన్నా ముందున్నాడు. పాకిస్తాన్ తో తలపడే భారత తుది జట్టను అంచనా వేశాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను ఓపెనర్లుగా ఎంచుకోగా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ లను వరుసగా.. 3,4,5 స్థానాలకు పరిమితం చేశాడు. కాకుంటే.. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కోసం.. రిషభ్ పంత్ నాలుగు, సూర్య కుమార్ ఐదో స్థానంలో వస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఇక.. అల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా 6వ స్థానానికి పరిమితవవ్వగా, దీపక్ హుడా 7, రవీంద్ర జడేజా 8వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. ఇక, బౌలర్లుగా.. స్పిన్ మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ లను ఎంచుకున్నాడు. ఆకాష్ చోప్రా అంచనా వేసిన జట్టు తుది జట్టు కాకపోవచ్చు. ఎందుకంటే.. నిలకడగా రాణిస్తూ ఫినిషర్ పాత్ర అద్భుతంగా పోషిస్తున్న దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకోకపోవడమే అందుకు కారణం. అంతేకాకుండా.. సీనియర్ వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ను బెంచ్ కు పరిమితం చేయకపోవచ్చు. వీరితో పాటు ఆకాష్ చోప్రా జట్టులో శ్రేయాస్ అయ్యర్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయికి చోటు దక్కలేదు. ఇక.. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియాకప్ ఆగస్టు 27న యూఏఈ వేదికగా మొదలవనుంచి. ఆ మరుసటి రోజే చిరకాల శత్రువులు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. లీగ్ దశలోనే కాకుండా సూపర్ 4లోనూ ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. ఇప్పటికే 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వీరే కాకుండా మరో ముగ్గురు స్టాండ్‌బైగా యూఏఈ వెళ్లనున్నారు. ఆకాశ్ చోప్రా ప్రెడిక్టడ్ XI: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్. Aakash Chopra feels all-rounder Deepak Hooda will have the wood on Dinesh Karthik in India's starting XI.#AsiaCup2022 pic.twitter.com/rybkzmFxlx — CricTracker (@Cricketracker) August 9, 2022 ఆసియా కప్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్. BREAKING BCCI have announced India’s squad for the Asia Cup 2022 Happy with it? #India #TeamIndia #CricketTwitter #AsiaCup pic.twitter.com/KEnRyYZpru — Sportskeeda (@Sportskeeda) August 8, 2022 ఇదీ చదవండి: వైరల్ అవుతున్న ఇషాన్ కిషన్ పోస్ట్.. సెలక్టర్లకు కౌంటరా? ఇదీ చదవండి: కాబోయే భార్యతో కలిసి బీచ్ ల వెంట తిరుగుతున్న టీమిండియా ఆల్‌రౌండర్.. ఫొటోస్ వైరల్!