ఫార్మాట్ మారినా ఆట మాత్రం మారలేదు.. అదే ఊపు.. అదే గెలుపు. ప్రస్తుతం టీంఇండియా వెస్టిండీస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్న భారత్ అదే ఉత్సాహాన్ని టీ20లో సైతం చూపించింది. తాజాగా జరిగిన తొలి టీ20లో 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో భారత బౌలర్ అర్షదీప్ కు విండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్ కు మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. టీంఇండియా నిర్థేశించిన 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఓపెనర్లు ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. తొలి ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ 11 పరుగులు ఇచ్చాడు. తర్వాత అర్షదీప్ రెండో ఓవర్ వేయడానికి రాగా బ్యాటింగ్ ఎండ్ లో మేయర్స్ ఉన్నాడు. తొలి బంతి ని సిక్స్ కొట్టగా రెండో బంతిని అర్షదీప్ వైడ్ వేశాడు. ఇక మూడో బాల్ వేయగా దాన్ని ఫోర్ కొట్టాడు. దాంతో భారత బౌలర్ కు గట్టి సమాధానం ఇవ్వబోతున్నట్లు చూశాడు మేయర్స్. కానీ అర్షదీప్ ఏమాత్రం బెదరలేదు. మంచి ఊపు మీదున్న విండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్ ను బోల్తా కొట్టించాడు. ఓ అద్భుతమైన షార్ట్ పిచ్ బంతి వేయగా దాన్ని అంచనా వేయలేని అతడు భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడు అర్షదీప్ కైల్ మేయర్స్ వైపు చూస్తూ ఏమైంది చూశావ్ గా అన్నట్లు తన బాడీ లాగ్వేజి ద్వారా తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మెుదట బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను ఇండియా బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 122 పరుగులే చేసింది. మరి అర్షదీప్ - కైల్ మేయర్స్ మధ్య జరిగిన సన్నివేశం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Kyle Mayers who? say Arshdeep Singh... Surprised one and all with that lethal bouncer...#INDvWI #WIvIND #DineshKarthik #T20I #Bhuvi #RohitSharma #Hitman #Arshdeep #INDvsWI #IndianCricketTeampic.twitter.com/Pmpn9hExZY — OneCricket (@OneCricketApp) July 29, 2022 ఇదీ చదవండి: Dinesh Karthik: తొలి టీ20లో విండీస్‌ను చిత్తు చేసిన భారత్! దుమ్ములేపిని DK ఇదీ చదవండి: మ్యాచ్ జరుగుతుండగా క్రికెట్ గ్రౌండ్‌లో ఆత్మాహుతి దాడి! బంకర్‌లోకి క్రికెటర్లు