హార్దిక్ పాండ్యా.. ఈ పేరు ప్రస్తుతం టీమిండియా క్రికెట్ లో ఓ సంచలనం. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి సీజన్ లోనే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించాడు. ఇంతకాలం ఆడిన ముంబై ఇండియన్స్ జట్టే రిటైన్ చేసుకోకుండా వదిలేస్తే.. గుజరాత్ జట్టు హార్దిక్ మీద నమ్మకం ఉంచి పగ్గాలను అప్పగించింది. ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాలను హార్దిక్ పాండ్యా వమ్ము కానివ్వలేదు. పూర్తిస్థాయి కొత్త జట్టుతో.. కెప్టెన్ గా అనుభవం లేకుండానే టైటిల్ సాధించాడు. ఇప్పుడు ఆ పట్టుదలే టీమిండియా టీ20 కెప్టెన్ అయ్యేలా చేసింది. అద్భుత ప్రదర్శన అయినా.. అందరి నుంచి విమర్శలైనా కెరీర్లో ఏదీ శాశ్వతం కాదని హార్దిక్ పాండ్యా నిరూపించాడు. ఐపీఎల్ 2021, టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఘోరంగా విఫలమవ్వడంతో హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ 2022 వరకు హార్దిక్ మైదానంలో అడుగు కూడా పెట్టలేదు. వెన్నెముక సర్జరీ తర్వాత.. తన పునరాగమనం మీదనే దృష్టి పెట్టిన అతను ఆరు నెలల సెలవులో కఠోర శ్రమ చేశాడు. తన ఫిట్ నెస్ ని పెంచుకోవడం, బౌలింగ్ పై దృష్టి పెట్టడం చేశాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హార్దిక్ చేసిన ప్రదర్శన అందరూ చూశారు. Hardik Pandya will captain the Indian side against Ireland for the T20I series.#HardikPandya #TeamIndia #indiavsireland pic.twitter.com/jqzXYQzbvT — Sports Tak (@sports_tak) June 15, 2022 ఆ ప్రదర్శనతోనే టీమిండియాలోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో స్థానం సంపాదించడమే కాకుండా.. ప్రదర్శనలోనూ పర్వాలేదనిపించాడు. అంతేకాకుండా ఇప్పుడు ఐర్లాండ్ తో జరగబోతున్న రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా కెప్టెన్ గా అవతరించాడు. టీమిండియా తరఫున ఇన్నాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ తో చెలరేగిన హార్దిక్ పాండ్యా ఇక నుంచి కెప్టన్ గా కూడా సేవలు అందించనున్నాడు. అయితే తనపై వచ్చిన విమర్శలు అన్నింటికి హార్దిక్ తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాడు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) జీవితం/కెరీర్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉన్న వారికి హార్దిక్ పాండ్యా కంబ్యాక్ ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. కెరీర్లో అద్భుతంగా రాణించిన తర్వాత హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల దగ్గరే హార్దిక్ పాండ్యా ఆగిపోయుంటే.. ఇప్పుడు ఈ ప్రశంసలు వినగలిగేవాడు కాదు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. ప్రశంసలు, విమర్శలు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ, ఆ సమయాన్ని అందుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం అన్నదే ముఖ్యం. హార్దిక్ పాండ్యా టీమిండియా టీ20 కెప్టెన్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) ఇదీ చదవండి: సిక్సర్స్ స్టార్ రాహుల్ తెవాటియా ఎమోషనల్ పోస్ట్! ఇదీ చదవండి: IPL నుంచి టీమిండియా వరకు రాహుల్ త్రిపాఠి ప్రయాణం..!