వరుసగా తొలి రెండు వరల్డ్ కప్‌లు గెలిచి.. అదే దూకుడుతో ముచ్చట మూడో వరల్డ్ కప్‌ను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన కరేబియన్ వీరులను.. పసికూన టీమిండియా ఫైనల్లో ఓడించి తొలి వన్డే వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 1983లో విశ్వవిజేతగా నిలిచింది టీమిండియా. అందరూ గెలిచిన తర్వాత భారత జట్టును ఛాంపియన్‌గా చూస్తే.. టోర్నీ మొదలవ్వక ముందే.. తామ ఛాంపియన్లమని నమ్మి జట్టును ముందుకు నడిపించిన ఒకే ఒక వ్యక్తి కపిల్ దేవ్. జట్టులోని ప్రతి ఆటగాడిలో కప్ గెలవాలనే తపనను రాచేసి.. అంతుచిక్కని వ్యూహాలతో హేమాహేమీ జట్లను మట్టికరిపించి.. భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ విజయ ప్రస్థానంలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక మరుపురాని, వీరోచితమైన ఇన్నింగ్స్ గురించి.. నేడు(డిసెంబర్ 6 శుక్రవారం) ఆయన 64వ పుట్టిన రోజు సందర్భంగా గుర్తుచేసుకుందాం.. 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఈ సంవత్సరాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. కపిల్ డెవిల్స్.. భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చేసింది ఈ సంవత్సరమే. 1983 ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తారా? అంటూ అవహేళన చేసిన సమయంలో.. ఒక్క మ్యాచ్ కాదు ఏకంగా ప్రపంచకప్పునే ఎత్తుకొచ్చేశారు. అప్పటి ఆ మ్యాచ్ లను చూడలేకపోయిన వారంతా.. ఇటీవల రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘83’ సినిమా చూసి అదే భావోద్వేగానికి లోనయ్యారు. ప్రపంచకప్పు టోర్నమెంట్ అంతా ఒకెత్తు అయితే.. 1983 జూన్ 18న టన్ బ్రిడ్జ్ వెల్స్ వేదికగా జింబాంబ్వేపై కపిల్ దేవ్ ఆడిన ఇన్నింగ్స్ ఒక ఎత్తు అవుతుంది. కపిల్ దేవ్ 135 బంతుల్లో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.. భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించింది ఈరోజే. సునీల్ గవాస్కర్(0), శ్రీకాంత్(0), మొహిందర్ అమర్నాథ్(5), సందీప్ పాటిల్(1), యశ్‌పాల్ శర్మ(9).. ఇలా టాప్ ఆర్డర్ మొత్తం పేకమేడల్లా కూలిపోయిన సమయంలో కపిల్ దేవ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటి నుంచి టీమిండియా స్కోర్ కార్డు పరుగులు పెట్టడం మొదలు పెట్టింది. ప్రతి బంతి, ప్రతి బౌలర్ ను విచక్షణారహితంగా దండించాడు. వచ్చే ప్రతి బాల్ కు పరుగులు రాబట్టాడు. అలా కేవలం 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175* పరుగులు చేశాడు. 5 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసిన పరిస్థితి నుంచి 8 వికెట్ల నష్టానికి 288 పరుగులకు చేర్చాడు. Talk about leading from the front! ️ #OnThisDay in 1983, captain @therealkapildev slammed 1⃣6⃣ Fours & 6⃣ Sixes to hammer 1⃣7⃣5⃣* off 1⃣3⃣8⃣ balls against Zimbabwe in the 1983 World Cup at the Tunbridge Wells. #TeamIndia pic.twitter.com/PIvoRrI64z — BCCI (@BCCI) June 18, 2022 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాంబ్వే.. తొలి ఓవర్లలో ఎంతో పటిష్టంగా కనిపించింది. ఆ తర్వాత 44 వికెట్ల వద్ద తొలి వికెట్ కోల్పోయింది మొదలు ఇంక ఇబ్బందుల్లో పడిపోయింది. మొత్తం 57 ఓవర్లలో 235 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మదన్ లాల్ కు 3 వికెట్లు, బిన్నీకి 2 వికెట్లు, కపిల్ దేవ్, బల్విందర్ సంధు, అమర్నాథ్ తలో వికెట్ పడగొట్టారు. భారత క్రికెట్ చరిత్రలో అభిమానులు ఈరోజును ఎప్పటికీ మర్చిపోరు. అందుకే.. ఇప్పటికీ కపిల్ దేవ్ వీరోచిత ఇన్నింగ్స్, కపిల్ డెవిల్స్ ను క్రికెట్ అభిమానులంతా గుర్తుచేసుకుంటున్నారు. అప్పటి కపిల్ దేవ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కపిల్ దేవ్ వీరోచిత ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 175* off 138 balls On this day in 1983, Kapil Dev produced one of the greatest individual performances of all-time to help India beat Zimbabwe in @cricketworldcup 1983 pic.twitter.com/g4H2CcGQhU — ICC (@ICC) June 18, 2022 He was there to win #OTD in 1983, Kapil Dev scored 1️⃣7️⃣5️⃣ against Zimbabwe, in one of the most iconic knocks ever played by an Indian #OnThisDay | : Getty pic.twitter.com/JMbHTZq7qL — SunRisers Hyderabad (@SunRisers) June 18, 2022 #OnThisDay in 1983 Cricket World Cup - #TeamIndia legend, Kapil Dev scored 175* in 138 balls against Zimbabwe at Tunbridge Wells! He smashed 16 boundaries & 6 sixes! #CricketTwitter pic.twitter.com/q6JPfjSDHv — Doordarshan Sports (@ddsportschannel) June 18, 2022 1-0 Sunil Gavaskar, 2-6 Kris Srikkanth, 3-6 Mohinder Amarnath, 4-9 Sandeep Patil, when he walked in and then 5-17 as Yashpal also went. Kapil Dev's epic 175* vs Zim was scored at Tunbridge Wells on this day in 1983! pic.twitter.com/Ylnh4K48ps — Joy Bhattacharjya (@joybhattacharj) June 18, 2022 #OnThisDay in 1983, Kapil Dev played an innings of a lifetime! pic.twitter.com/BOi0VNI2K7 — 100MB (@100MasterBlastr) June 18, 2022 ఇదీ చదవండి: అవేశ్ ఖాన్ సూపర్ స్పెల్.. ఒకే ఓవర్లో 3 వికెట్లు.. వైరల్ అవుతున్న వీడియో! ఇదీ చదవండి: తగ్గదేలే అంటున్న దినేష్ కార్తీక్.. ధోనీ రికార్డులు బద్దలు కొట్టేశాడు!