MLA Kilari Rosaiah: వైఎస్సార్ సీపీ నేత, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రోశయ్య జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై ఎమ్మెల్యే కిలారి రోశయ్య క్లారిటీ ఇచ్చారు. ఆయన సుమన్ టీవీతో మాట్లాడుతూ.. ‘‘నేను జనసేనలో చేరటం పెద్ద జోక్. ఈనాడు పేపర్లో ఓ వార్త పడింది. క్యాడర్‌ను డిస్ట్రబ్ చేయాలని పథకం ప్రకారం చేస్తున్నారు. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల మీద బురద వేయాలని చూస్తున్నాయి. నా మీద కొద్దిగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతినుంచి ఒక వర్గం ఆ నియోజకవర్గాన్ని ఏలుతూ వచ్చింది. సీఎం జగన్ పుణ్యమా అని నేను పొన్నూరు వెళ్లి గెలవటం జరిగింది. నా గెలుపును వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను అసలు పవన్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొనలేదు. అది తప్పుడు న్యూస్. అక్కడ వినాయక చవితి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉప్పలపాడు అనే గ్రామంలో మా పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీ మరికొంతమంది ఆహ్వానించారు. అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇది ఎక్కడా పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుక కాదు. అది పార్టీ రహితంగా అందరూ కలిసి చేసుకునే పండుగ. అక్కడ నేనే స్వీట్ వడ్డించా. అక్కడ భోజనం చేసిన వాళ్లను అడిగితే.. అది పవన్ కల్యాణ్ పుట్టిన రోజా.. వినాయక చవితి అన్నదానమా అని తెలుస్తుంది. నేను సీఎం జగన్ వల్లే పొన్నూరులో గెలిచాను. ఆయనే మా నాయకుడు. రావి వెంకట రమణ, దూళిపాళ్ల నరేంద్ర ఓ పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారు. పార్టీ క్యాడర్‌ను డిస్ట్రబ్ చేయటానికి చూస్తున్నారు. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాను. ఇక్కడ జరుగుతున్నవి అన్నీ సీఎం గారికి తెలుసు. వాళ్లు పేపర్లో వేసినంత మాత్రాన అబద్ధం నిజం కాదు.. నిజం అబద్ధం కాదు. ఇంట్లోనే రాజకీయ శత్రువు ఉన్నాడు. అతను కావాలనే డిస్ట్రబ్ చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో నన్ను ఓడించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. అది అధిష్టానానికి కూడా తెలుసు’’ అని అన్నారు. ఇవి కూడా చదవండి : 2024లో కేంద్రంలో వచ్చేది మన ప్రభుత్వమే: సీఎం కేసీఆర్