టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రస్తుతం తన దృష్టిని అంతా రాజకీయాల మీదే పెట్టారు. ఏపీ పాలిటిక్స్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ.. వారిని కలుస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ సందర్భంగా తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణాన్ని వచ్చేవారం బయట పెడతానంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతాను. ఈడీ, ఐటీ, సీబీఐకి భయపడి సీఎం జగన్ ఢిల్లీలో తలవంచారు. ఆయనవన్ని పదో తరగతి పాస్-డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు. జగన్ టైం అయిపోయింది.. ఆయన ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడింది. జగన్ అత్తెసరు తెలివితేటలతో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమా రాదు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వెళ్లిపోవడం తప్ప’’ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన వాటి కంటే బయటకు వెళ్లిన పరిశ్రమలే ఎక్కువని లోకేష్ ఎద్దెవా చేశారు. పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా సీఎంకు వాటా ఎంత అనే చర్చ వస్తుందని.. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే తాను చర్చకు సిద్ధమని లోకేష్ సవాలు చేశారు. జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమా టీడీపీ ప్రభుత్వం కృషి వల్ల వచ్చిందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఉద్యోగుల కల్పన జరిగిందని జగన్ ప్రభుత్వమే ఒప్పుకుందన్నారు లోకేష్. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన దాదాపు 500 హామీల్లో మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాలు గెలిపించాలా అని లోకేష్. ఢిల్లీలో మెడలు వంచుతానన్న జగన్.. రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. ఇక మహానాడు జరిగిన సమయంలో కూడా నారా లోకేష్ పెద్ద కుంభకోణం బటయపెడతానని చెప్పారు. ఇప్పుడు వచ్చే వారంలోనే బయటపెడాతనని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మరి లోకేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: చంద్రబాబుకి కొత్త టెన్షన్!TDPలో లోకేష్‌కు పోటీగా అచ్చెన్నాయుడు! ఇది కూడా చదవండి: లోకేష్‌ను కలిసిన YSRCP ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కూతురు