నందమూరి హరికృష్ణ.. సినిమాల్లో రాణిస్తూ.. రాజకీయాల్లో తండ్రికి చేదుడోవాదోడు నిలిచాడు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన ప్రారంభంలో ప్రచార రథానికి సారధిగా ఉండి.. తండ్రితో పాటు రాష్ట్రం అంతటా పర్యటించి.. ప్రజలకు చేరువయ్యాడు. అనంతరం ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా చేశారు. కొన్నాళ్లకి అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలు, సినిమాలకూ దూరం అయ్యారు. ఈ క్రమంలో2018 ఆగస్టు 29న నల్గొండ సమీపంలోని అన్నేపర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఓ అభిమాని ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నేడు హరికృష్ణ వర్థంతి సందర్భంగా ఆయన బావ చంద్రబాబు నాయుడు, మేనల్లుడు లోకేష్ ఆయనకు నివాళులర్పించారు. హరికృష్ణ మంచితనాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణగారు. తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథసారథిగా, నటుడిగా... తెలుగు ప్రజలకు ఎంతో చేరువైన హరికృష్ణగారు... తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతోసేవ చేసారు.(1/2) pic.twitter.com/DD0bkqynyt — N Chandrababu Naidu (@ncbn) August 29, 2022 ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు.. హరికృష్ణను తలుచుకుని.. ‘‘మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణగారు. తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథసారథిగా, నటుడిగా.. తెలుగు ప్రజలకు ఎంతో చేరువైన హరికృష్ణగారు.. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతోసేవ చేసారు. నందమూరి హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా ఆ సౌజన్యమూర్తి స్మృతికి నివాళులు’’అంటూ ట్వీట్ చేశారు. ముక్కుసూటితనం హరి మావయ్య నైజం. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయనకే ప్రత్యేకమైన వ్యక్తిత్వం. రాజకీయాల్లోనూ, నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరి మావయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/xO74tzyu6u — Lokesh Nara (@naralokesh) August 29, 2022 ఇక లోకేష్..‘ముక్కుసూటితనం హరి మావయ్య నైజం. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయనకే ప్రత్యేకమైన వ్యక్తిత్వం. రాజకీయాల్లోనూ, నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరి మావయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను’అంటూ ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు, హరికృష్ణ అభిమానులు ఆయనను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: భార్యకి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన నారా లోకేశ్! ఫోటోలు వైరల్! ఇది కూడా చదవండి: అక్క కోసం ‘E’ స్కూటర్ తయారు చేసిన తమ్ముడు! 3 గంటల ఛార్జ్ తో 60కి.మీ..!