హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయంల అక్కర్లేని పేరు. నటనపై ఉన్న ఆసక్తితో జబర్ధస్త్ లోకి ఎంట్రి ఇచ్చి అనంతరం ఏ రేంజ్ లో గుర్తింపు సంపాందించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో కామెడీ పంచ్ లోతో నవ్వుల పువ్వులు పూయిస్తాడు. అయితే తన స్కిట్స్ వల్ల అందులో వేసే పంచ్ ల కారమఁగా హైపర్ ఆది పలు వివాదాలకు కేరాఫ్ మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మరోసారి ఆది ఓ స్కిట్ లో వేసిన పంచ్ లు వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పంచ్ లకు హర్ట్ అయిన కొందరు సోషల్ మీడియా ద్వారా ఆదిపై ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఓ షోలోని స్కిట్ భాగంగా ఆది ఇద్దరు వ్యక్తులతో సంభాషణ చేస్తాడు. వారితో.. మీది ఏ పార్టీ అని ఆది అనగానే.. "ఒకరు మేం ఉన్నాం.." అని మరొకరు "మేం విన్నాం.." అని అంటారు. దీంతో వారికి బదులు సమాధానంగా "మేముం ఉంటాం" అంటూ ఆది కౌంటర్ ఇస్తారు. ఆ స్కిట్ సంబంధించిన వీడియో బయటకి రాగానే నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఆవీడియోలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు సంబంధించిన YCPపార్టీని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్‌గా పంచ్‌లు వేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో చూసి హర్ట్ అయిన వైసీపీ ఫ్యాన్స్ హైపర్ ఆదిపై బూతులతో రెచ్చిపోతున్నారు. క్షమాపణలు చెప్పకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదీ చదవండి: విగ్నేష్ శివన్ చెల్లెలికి భారీగా ఆడపడుచు కట్నం! నయన్ ఎంత ఇచ్చింది అంటే?మరికొందరైతే హైపర్ ఆది ఫోన్ నెంబర్‌ను షేర్ చేస్తూ ఫోన్ చేస్తుంటే ఎత్తటం లేదు.. ఎత్తితే ఉంటుందంటూ బూతు పదజాలం వాడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. మరి దీనిపై హైపర్ ఆది ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి. గతంలోను కొన్ని వివాదస్పద స్కిట్ లతో హైపర్ ఆదిలో వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.