కుప్పం అభివృద్ధిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్ల నిధులను సంబంధించిన జీవో సీఎం జగన్ విడుదల చేశారు. కుప్పం మున్సిపాల్టీలో రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సరఫరా, పార్క్‌లు , కొత్త మున్సిపల్ ఆఫీస్, శ్మశానం వాటిక కోసం ఈ నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఐదు రోజుల కిందటే కుప్పం నేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భాంగా కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ సమావేశం జరిగిని వారం రోజుల్లోనే కుప్పం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల నిధుల జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆగష్టు 4న కుప్పం నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని పేర్కొన్నారు. ఈ వేళ కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తాము. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటాం అని సీఎం జగన్.. కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్.. దిశా నిర్దేశం చేశారు. అలా సమావేశం అయిన వారం రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం జగన్. మరి.. కుప్పంకి నిధులు విడుదల చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం…. స్పందించిన MP! ఇదీ చదవండి: గోరంట్ల మాధవ్ వీడియోపై మంత్రి రోజా వ్యాఖ్యలు