సినీ ఇండస్ట్రీలో కొత్త కంటెంట్ తో సినిమాలు చేస్తే ఆదరించేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని మరోసారి ప్రూవ్ అయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించిన 'బింబిసార' సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. కమర్షియల్ హంగులు జోడించి సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిన ఈ సినిమా.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన లాభాలతో దూసుకుపోతుంది. అలాగే రిలీజైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసి ఈ ఏడాది హిట్స్ లిస్టులో చేరింది బింబిసార. ఇక ఏ సినిమా విడుదలైనా థియేటర్లకు వెళ్లి చూసేవారు కొందరైతే.. ఆ సినిమా ఓటిటిలోకి ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూసే వారు మరికొందరు. అందుకే థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాల నుండి ఎప్పుడెప్పుడు ఓటిటి రిలీజ్ సమాచారం కోసం చూస్తుంటారు. అయితే.. బింబిసార సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఆయనే స్వయంగా మాట్లాడటం విశేషం. సాధారణంగా ఇప్పుడు పెద్ద సినిమాలు ఏవైనా థియేట్రికల్ రిలీజ్ తర్వాత 8 వారాలకు గానీ ఓటిటిలోకి రావని ఇటీవలే ప్రకటించింది చిత్రమండలి. కానీ.. బింబిసార సినిమా వచ్చేసరికి 50 రోజుల తర్వాతే ఓటిటిలోకి రానుందని దిల్ రాజు తెలిపారు. కావున బింబిసార సినిమా విడుదలైన 50 రోజులకు అంటే.. సెప్టెంబర్ 23న ఓటిటిలో స్ట్రీమింగ్ కానుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటిటి హక్కులను జీ స్టూడియోస్ వారు దక్కించుకున్నారని, జీ5లో సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. మరి బింబిసార సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. #Bimbisara will not stream on OTT anytime soon Watch it in theatres pic.twitter.com/YEK7CAo91O — Fukkard (@Fukkard) August 9, 2022