ఇటీవలి కాలంలో థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకంటే ఓటిటి వేదికల ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. కరోనా టైమ్ నుండి ప్రేక్షకులంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక వారికి తగ్గట్టుగానే థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు.. నెలా రెండు నెలలు తిరగకుండానే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు థియేటర్లకు వెళ్లి చూసే అవసరం, మనీ ఎందుకని నార్మల్ ఆడియెన్స్, ఫ్యామిలీ ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఓటిటిలతో పాటు కొత్త ఓటిటిలు సైతం పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ లాంటి ఓటిటిలు థియేట్రికల్ రిలీజ్ అయిపోయిన సినిమాలను లేదా నేరుగా స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్న సినిమాల హక్కులను దక్కించుకునేందుకు.. ప్రతివారం పోటీ పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆగష్టు రెండో వారంలో ఓటిటి విడుదలకు దాదాపు 25 సినిమాలు సిద్ధమవుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్(4)లతో పాటు 21 ఓటిటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదం లభించనుంది. మరి ఈ వారం ఓటిటి/థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం! నెట్ ఫ్లిక్స్(Netflix): ఆగష్టు 8 - నరుటో: షిప్పుడెన్(సిరీస్ 1) ఆగష్టు 8 - హ్యాపీ బర్త్ డే(తెలుగు) ఆగష్టు 9 - ఐ జస్ట్ కిల్డ్ మై డ్యాడ్(హాలీవుడ్) ఆగష్టు 10 - ఇండియన్ మ్యాచ్ మేకింగ్(సిరీస్ - సీజన్ 2) ఆగష్టు 10 - లాకీ అండ్ కీ (సిరీస్ 3) ఆగష్టు 10 - బ్యాంకు రాబర్స్: ది లాస్ట్ గ్రేట్ హెయిస్ట్ ఆగష్టు 11 - దోతా: డ్రాగన్స్ బ్లడ్: బుక్ 3(హాలీవుడ్) ఆగష్టు 12 - నెవర్ హావ్ ఐ ఎవర్ (సిరీస్ - సీజన్ 3) ఆగష్టు 13 - బ్రూక్లిన్ నైన్ - నైన్: సీజన్ 8(సిరీస్) ఆగష్టు 14 - గాడ్జిల్లా vs కాంగ్ (హాలీవుడ్) ఆహా(Aha): ఆగష్టు 12 - మాలిక్ ఆగష్టు 12 - మహా మనిషి ఆగష్టు 12 - ఏజెంట్ ఆనంద్ సంతోష్-4(వెబ్ సిరీస్) అమెజాన్ ప్రైమ్(Amazon Prime): ఆగష్టు 10 - సోనిక్ ది ఎడ్జ్ హాగ్(హాలీవుడ్) ఆగష్టు 10 - ది లాస్ట్ సిటీ(హాలీవుడ్) ఆగష్టు 11 - మలయాన్ కుంజు(మలయాళం) ఆగష్టు 11 - థ్యాంక్ యూ(తెలుగు) ఆగష్టు 12 - ఎ లీగ్ ఆఫ్ దెయిర్ ఓన్ (హాలీవుడ్) ఆగష్టు 12 - కాస్మిక్ లవ్ (హాలీవుడ్) జీ5(Zee5): ఆగష్టు 11 - రాష్ట్ర కవచ ఓం(హిందీ) ఆగష్టు 11 - బ్యూటిఫుల్ బిల్లో(పంజాబీ) ఆగష్టు 11 - విండో సీట్(కన్నడ) ఆగష్టు 12 - హలో వరల్డ్ (వెబ్ సిరీస్) ఆగష్టు 12 - శ్రీమతి (బెంగాలీ) సోనీ లివ్(Sony LIV): ఆగష్టు 12 - గార్గి (తెలుగు) డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar): ఆగష్టు 11 - ది వారియర్ (తెలుగు/తమిళం) ఆగష్టు 12 - క్యాడవర్ (తెలుగు/తమిళం/కన్నడ/మలయాళం) ఇక ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు: ఆగష్టు 11 - లాల్ సింగ్ చడ్డా ఆగష్టు 11 - రక్షా బంధన్ (హిందీ) ఆగష్టు 12 - మాచర్ల నియోజకవర్గం ఆగష్టు 13 - కార్తికేయ 2 ఈ విధంగా సినిమా లవర్స్ కి, ఓటిటి ప్రేక్షకులకు ఈ వారం పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాయి వెబ్ సిరీస్ లు/సినిమాలు. ఒకే వారంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది మొదటిసారి కావడం విశేషం. మరి పైన పేర్కొన్న 27 ఓటిటి సినిమాలు, 4 థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. This Week OTT Releases - Movies pic.twitter.com/zX19tbNUv2 — Aakashavaani (@TheAakashavaani) August 7, 2022 #ThankYouTheMovie as expected goes for Early Streaming (20 Days). The film isn’t supposed to arrive before 4 weeks (before release) actually! On the other hand, even small movies are being asked to wait for 4 Weeks by big wigs in ongoing Chamber discussions. This is a sham!! https://t.co/yUKi1QsuGS pic.twitter.com/5jbq5IXU9y — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 9, 2022